ఇర్ఫాన్‌ను తలచుకొని వెక్కివెక్కి ఏడ్చిన కుమారుడు

10 Apr, 2021 11:58 IST|Sakshi

తండ్రిని తలుచుకుని ఆనందబాష్పాలు రావాలి. అశ్రువులు కాదు. కాని తండ్రి జీవించి ఉంటే ఆనంద బాష్పాలు వచ్చేవే. తాజాగా జరిగిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ – 2021 ఫంక్షన్‌లో తండ్రి ఇర్ఫాన్‌ ఖాన్‌కు వచ్చిన అవార్డును అతడి తరఫున కుమారుడు బాబిల్‌ ఖాన్‌ అందుకుంటూ తండ్రిని తలచుకుని వెక్కివెక్కి ఏడ్చాడు. ఇటీవల ముంబైలో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ ఈవెంట్‌ జరిగింది. ఆ వేడుకలో ఇర్ఫాన్‌ ఖాన్‌ను మరణానంతర ‘లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు’ ప్రకటించారు. అలాగే ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది.

దానిని అందుకోవడానికి ఇర్ఫాన్‌ కుమారుడు బాబిల్‌ను స్టేజ్‌ మీదకు నటులు ఆయుష్మాన్‌ ఖురానా, రాజ్‌కుమార్‌ రావ్‌ పిలిచారు. ఆ సమయంలో ఆయుష్మాన్‌ మాట్లాడుతూ ‘ఇర్ఫాన్‌ ఖాన్‌ నుంచి మేమందరం ఎంతో నేర్చుకున్నాం’ అన్నాడు. అప్పుడు అవార్డు అందుకున్న బాబిల్‌ తండ్రిని తలచుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. అది చూసి రాజ్‌కుమార్‌ రావ్‌ కూడా కన్నీరు కార్చాడు. చాలామంది భావోద్వేగానికి లోనయ్యారు. ‘నేనేమి ప్రత్యేక ఉపన్యాసం తయారు చేసుకుని రాలేదు. నన్ను మీ అందరూ అక్కున చేర్చుకున్నారు. అది చాలు’ అన్నాడు బాబిల్‌. ఈ ఈవెంట్‌ ప్రసారం కావాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు