సీబీడీ ఆయిల్‌ను లీగల్ చేయాలి: నటుడి భార్య

30 Sep, 2020 09:47 IST|Sakshi
ఫైల్ ఫోటో

సాక్షి, ముంబై: బాలీవుడ్ న‌టుడు సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన తరువాత నార్కోటిక్స్ డ్రగ్స్ పై తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా క‌న్నాబిడియోల్ లేదా సీబీడీ ఆయిల్‌  వినియోగం చ‌ట్టవిరుద్ధమా, కాదా అనే విషయం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ భార్య సుతాపా సికదర్ సంచలన విజ్ఞప్తి చేశారు. సీబీడీ ఆయిల్‌ను ఇండియాలో చట్టబద్ధం చేయాలనే  హ్యాష్ ట్యాగ్  యాడ్ చేశారు. 

ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ చికిత్స తీసుకున్న లండన్ ఆసుపత్రి ఫోటోను సుతాపా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో షేర్ చేశారు. దాదాపు రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ ఇర్ఫాన్ ఈ ఏడాది ఏప్రిల్ 29న కన్ను మూశారు. మరోవైపు ఇప్పటికే గాయని సోనా మోహపాత్రా కూడీ సీబీడీ ఆయిల్ ప్రయోజనాలపై ఫేస్‌బుక్‌లోఒక పోస్ట్ పెట్టారు. గత ఏడాది తన సోదరి క్యాన్సర్ చికిత్స సందర్భంగా పలు, శస్త్రచికిత్సలు  చేయించుకున్నప్పుడు  నొప్పి నివారణకు, త్వరగా కోలుకోవటానికి ఈ డ్రగ్ మాజిక్ లా పనిచేసిందని పేర్కొనడం విశేషం.

కాగా ఆన్ లైన్ ద్వారా నటి శ్రధ్ధాకపూర్ కి తానే సీబీడీ ఆయిల్ ఆర్డర్ చేశానని సుశాంత్ మాజీ మేనేజర్ జయాసాహా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో తెలిపారు. సుశాంత్ కి ఎలా ఇవ్వాలో రియా చక్రవర్తికి వాట్సాప్ ద్వారా వివరంగా తెలియజేశానని వెల్లడించింది. సీబీడీ ఆయిల్ కోసం సాహాతో చాట్ చేసినట్లు ఆరోపణలు రావడంతో శ్రద్ధాను ఎన్‌సీబీ విచారిస్తోంది. దీంతోపాటు బాలీవుడ్ డ్రగ్గిస్టులపై అధికారులు  కూపీ లాగుతున్నారు. (చదవండి: డ్రగ్స్‌ కేసులో ముగ్గురు బడా హీరోలు!)

సీబీడీ ఆయిల్ అంటే ఏమిటి ? 
సీబీడీ ఆయిల్‌ను గంజాయి ఆకుల నుంచి త‌యారు చేస్తారు. గంజాయి ఆకుల నుంచి ప‌లు ప‌దార్థాల‌ను వెలికి తీసి వాటితో సీబీడీ ఆయిల్‌ను త‌యారు చేస్తారు. సీబీడీ ఆయిల్‌ను క‌న్నాబిడియోల్ అని కూడా పిలుస్తారు. గంజాయి మోతాదు 40 శాతం వ‌ర‌కు ఉంటుందట. అయితే ఇత‌ర దేశాల్లో వైద్యులు ప‌లువురు రోగులకు సీబీడీ ఆయిల్‌ను ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. మాన‌సిక స‌మ‌స్యలు,  జాయింట్ పెయిన్స్‌, నిద్రలేమి, గుండె సంబంధ స‌మ‌స్య‌ల‌కు ఔష‌ధంగా వాడతారు. ఇండియా సహా పలు దేశాల్లో ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి నిషేధం లేదు. అంతేకాదు దీన్ని ఎక్కువగా వినియోగించే దేశాలలో భారత్ కూడా ఒకటి. అమెజాన్ లాంటి ఆన్‌లైన్ సైట్ల ద్వారా దేశంలో  అందుబాటులో ఉన్నట్టు  సమాచారం.

London revist looking at his hospital room from outside like everytime I did while he was there#walkingalone#wishyouwerethere#cancerpain#LegalizeCBDoilinindia

A post shared by Sutapa Sikdar (@sikdarsutapa) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా