ఆ వెబ్‌సిరీస్‌లో విలన్‌గా మారిన హీరోయిన్‌ స్నేహ భర్త

26 Feb, 2023 10:00 IST|Sakshi

తమిళ సినిమా: ఇరు దురువం ఈ వెబ్‌ సిరీస్‌ కరోనా లాక్‌డౌన్‌ సమయంలో సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌ అయ్యి విశేష ప్రేక్షకుల ఆదరణ పొందింది. దీంతో తాజాగా దానికి సీక్వెల్‌ను రూపొందించారు. తొలి వెబ్‌ సిరీస్‌కు కుమరన్, రెండవ భాగానికి అరుణ్‌ ప్రకాష్‌ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నటుడు నందా, ప్రసన్న, నటి బిగ్‌ బాస్‌ అభిరామి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.ఇది సోనీ లీవ్‌ ఓటేటీ ప్లాట్‌ ఫామ్‌ లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఈ సందర్భంగా యూనిట్‌ వర్గాలు చెన్నైలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నటుడు ప్రసన్న మాట్లాడుతూ తాను ఇందులో ప్రతి నాయకుడిగా వైవిధ్య భరిత కథాపాత్రను పోషించినట్లు చెప్పారు. తన పాత్రలో చాలా లేయర్స్‌ ఉంటాయన్నారు. ఇక కాగా నటుడు నందా ఈ వెబ్‌ సిరీస్‌ తొలి భాగంలో కథానాయకుడుగా నటించారు. దీంతో ఇప్పుడు సీక్వెల్‌లో నటించడం సులభం అయిందని చెప్పారు. ఇందులో ఈయన సిన్సియర్‌ పోలీస్‌ అధికారిగా నటించారు.

దర్శకుడు అరుణ్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ ఇరు దురువం వెబ్‌ సిరీస్‌కు ఇది సీక్వెల్‌ అన్నారు. తొలి భాగంలోని విక్టర్‌ (నందా) పాత్ర తనను బాగా ఆకట్టుకుందన్నారు. దాన్ని మెయిన్‌గా తీసుకొని 10 ఎపిసోడ్స్‌ ఈజీగా రూపొందించవచ్చని భావించారన్నారు. అలా పది నెలల పాటు ఈ వెబ్‌ సిరీస్‌ కథను తయారు చేసినట్లు చెప్పారు. దీనికి మూడో సీక్వెల్‌ కూడా ఉంటుందని చెప్పారు. ఇందులో కిడ్నాప్‌ గురైన యువతిగా, ఒక బిడ్డకు తల్లిగా, భర్తకు దూరమైన భార్యగా తాను నటించినట్లు నటి అభిరామి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు