రాజమౌళి నిర్ణయంతో వకీల్‌సాబ్‌ నిర్మాత అప్‌సెట్‌!

26 Jan, 2021 15:22 IST|Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శకుడు ఎస్ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్‌ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. రెండేళ్లుగా ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందరి ఆశలను ఎట్టకేలకు నిన్న ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను డైరెక్టర్‌ రాజమౌళి అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దసరా సందర్భంగా అక్టోబర్‌ 13న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఇద్దరూ రాజమౌళి నిర్ణయంతో సంతోషంగా ఉన్నప్పటికీ బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ మాత్రం నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల తేదినే బోనీ కపూర్‌ ప్రొడక్షన్‌లో వస్తున్న మైదాన్‌ సినిమా విడుదల కానున్నట్లు నిర్మాత ఆరు నెలల క్రితమే ప్రకటించాడు. ఈ రెండు సినిమాల్లోనూ అజయ్‌ దేవగణ్‌ నటిస్తుండటం విశేషం. ​అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల తేదీకి ముందే బోనీ కపూర్‌తో మాట్లాడాలని అజయ్‌ రాజమౌళిని కోరాడట. చదవండి: సింగర్‌ సునీత వెడ్డింగ్‌.. సుమ డాన్స్‌ అదరహో

అజయ్‌ నటిస్తున్న మైదాన్‌ చిత్రం ఫుట్‌బాల్‌ లెజండరీ ఆటగాడు సయ్యద్‌ అబ్దుల్‌ రహిత్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. అందుకే ప్రత్యేకంగా రాజమౌళితో ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల తేదీని ప్రకటించే ముందు బోనీ కపూర్‌ను సంప్రదించాలని అజయ్‌ దేవగణ్‌ చెప్పినట్లు సమాచారం. అయితే బోనీ కపూర్‌ను కలవకుండానే రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించాడు. దీంతో ఈ బాలీవుడ్‌ నిర్మాత అప్‌సెట్‌ అయినట్లు తెలుస్తోంది. ‘తప్పకుండా నేను నిరాశ చెందుతున్నాను! ఇది చాలా సరైనది కాదు. మైదాన్ విడుదల తేదీని నేను ఆరు నెలల క్రితం ప్రకటించాను. సినీ పరిశ్రమను కాపాడటానికి మనమందరం కలిసి రావాల్సిన సమయంలో, అతను (రాజమౌళి) ఇలా చేశాడు’ అని బోనీ కోపంగా ఉన్నట్లు టాక్‌. చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

ఇదిలా ఉండగా కోవిడ్‌ అనంతరం ప్రతి సినిమాకు చెందిన యూనిట్‌, నిర్మాతలు తమ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్‌ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద ఫైట్‌ను నివారించేందుకు 'ఆర్ఆర్ఆర్' కోసం బోనీ కపూర్ తన చిత్రాన్ని వాయిదా వేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. మరోవైపు బాలీవుడ్‌లో విజయం సాధించిన పింక్ రీమెక్‌ వకీల్‌ సాబ్‌ను బోనీ కపూర్‌, దిల్‌ రాజ్‌ కలిసి నిర్మిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు