Isha Koppikar: ఆ హీరో నన్ను ఒంటరిగా రమ్మన్నాడు

3 Mar, 2022 09:24 IST|Sakshi

కాస్టింగ్‌ కౌచ్‌.. సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపించే పేరు ఇది. ఇటివల కాలంలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. స్టార్‌ హీరోయిన్స్‌ నుంచి క్యారెక్టర్‌ అర్టిస్ట్‌ల వరకు ఎంతో మంది దీని బాధితులుగా ఉన్నారు. సుచి లీక్స్‌, సింగర్‌ చిన్మయ్‌ శ్రీపాద వివాదం నుంచి కాస్టింగ్‌ కౌచ్‌ బాధితులు ఒక్కొరుగా బయటకు వచ్చి నోరు విప్పుతున్నారు. తాజాగా నాగార్జున ‘చంద్రలేఖ’ హీరోయిన్‌ ఈషా కొప్పికర్‌ సైతం కాస్టింగ్‌ కౌచ్‌పై పెదవి విప్పింది. 90లో ఇషా కొప్పికర్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణించిన సంగతి తెలిసిందే. 2009లో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన ఆమె..నిఖిల్ హీరోగా వచ్చిన ‘కేశవ’ సినిమాలో కీ రోల్‌ పోషించి రీఎంట్రి ఇచ్చింది.

చదవండి: 9 ఏళ్ల వయసులోనే షాకిచ్చాడు: వర్మ సోదరి ఆసక్తికర వ్యాఖ్యలు

ఆ తర్వాత పలు వెబ్‌ సిరీస్‌లో నటిస్తూ వస్తున్న ఇషా రీసెంట్‌ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో తను కూడా కాస్టింగ్‌ కౌచ్‌ బాధితురాలినే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘చదువుకుంటున్న క్రమంలోనే పాకెట్‌ మనీ కోసం మోడలింగ్‌ చేశాను. దీంతో నాకు సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలో ‘‘ఏక్‌ థా దిల్‌ థా ధడ్కన్‌’ ఆఫర్‌ రావడంతో హీరోయిన్‌ అయ్యాను. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ నిర్మాత ఫోన్‌ చేసి అవకాశం ఉందని చెప్పాడు. ఇందుకోసం మీరు మొదట హీరోని కలవాలి అని చెప్పాడు. ఆ తర్వాత హీరోకి కాల్‌ చేస్తే ‘మీరు ఒంటరిగా రండి. ఏకాంతంగా కలుద్దాం. మీతో పాటు మీ స్టాప్‌ ఎవరు ఉండకూడదు’ అన్నాడని’’ చెప్పుకొచ్చింది.

చదవండి: హీరోగా ‘మైనింగ్‌ కింగ్‌’ గాలి జనార్థన్‌ రెడ్డి కుమారుడు, మూవీ టైటిల్‌ ఖరారు

అలాగే ఆ హీరోతో మాట్లాడాక తనకు అసలు విషయం అర్థమైందని, వెంటనే నిర్మాతకు ‘నా టాలెంట్‌, లుక్స్‌తో ఇక్కడకు వచ్చాను. అదే విధంగా నాకు అవకాశాలు వస్తే చేస్తాను’ అని తెగేసి చెప్పినట్లు పేర్కొంది. దీంతో సదరు నిర్మాత, హీరో తన మీద కోపంతో ఆ ప్రాజెక్ట్‌ నుంచి తొలగించినట్లు ఈషా తెలిపింది. 'ఏక్‌ థా దిల్‌ ఏక్‌ థా ధడ్కన్‌'తో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇషా కొప్పికర్‌. ఆ తర్వాత వరస ఆఫర్లు అందుకుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు తెలుగు, కన్నడ, తమిళంలో కూడా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో తెలుగులో నాగార్జున చంద్ర లేఖ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె ప్రేమతో రా, కేశవ చిత్రాల్లో నటించింది. చంద్రలేఖ సినిమాలో ఇషా తెలుగు గుర్తింపు పొందింది. 

>
మరిన్ని వార్తలు