Bigg Boss: బిగ్‌ బాస్.. అసలేంటి ఈ మసాలా?.. మండిపడుతున్న నెటిజన్స్!

5 Nov, 2023 10:05 IST|Sakshi

బిగ్ బాస్ రియాలిటీ షో అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తోంది. హిందీ బిగ్ బాస్ సీజన్-17 విజయవంతంగా కొనసాగుతోంది. ఈ వారంలో తాజాగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మనస్వి మామ్‌గాయ్ ఎలిమినేట్ ‍అయినట్లు హోస్ట్ సల్మాన్ ఖాన్ ప్రకటించారు. ఈ వారంలో ఈ వారం నామినేట్ అయినవారిలో సమర్థ్ జురెల్, ఇషా మాల్వియా, అరుణ్ మాశెట్టి, సనా రయీస్ ఖాన్ కూడా ఉన్నారు. మానస్వికే తక్కువ ఓట్లు రావడంతో ఎంట్రీ ఇచ్చిన వారానికే బయటకొచ్చేసింది.

‍అయితే బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సమర్థ్ జురెల్, ఇషా తీరు దారుణంగా ఉందంటూ కామెంట్స్ చేశారు. వీరిద్దరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సల్మాన్ భాయ్ ఏంటి ఇదంతా అని ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియోలో ఇషా, జురెల్ ఇద్దరూ ఒకే బెడ్‌పై నిద్రిస్తూ కనిపించారు. 

ఇది చూసిన నెటిజన్స్ కంటెస్టెంట్స్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. 19 ఏళ్ల వయసులో ఇలా చేయడమేంటి? అంటూ ఇషాను ట్రోల్ చేశాడు. సల్మాన్ భాయ్ ఫ్యామిలీ షో పేరుతో ఈ మసాలా డ్రామా ఏంటి? అని కామెంట్ చేశాడు. మరొకరు రాస్తూ.. ఫ్యామిలీ షో పేరుతో ప్రేక్షకులకు ఇలాంటివీ చూపించడమేంటని మండిపడుతున్నారు. బిగ్ బాస్ షోను అడల్ట్ షోగా మార్చేశారంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. హౌస్‌లో ఇషా మాజీ భాయ్‌ ఫ్రెండ్ అభిషేక్ కుమార్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో అభిషేక్ అక్కడే ఉన్నారు. 

మరిన్ని వార్తలు