చూడ్డానికి జూనియర్‌ కత్రినా కైఫ్‌లా..

20 Dec, 2020 08:57 IST|Sakshi

చూడ్డానికి జూనియర్‌ కత్రినా కైఫ్‌లా ఉండే ఇషా తల్వార్‌.. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రముఖ దర్శక, నిర్మాత వినోద్‌ తల్వార్‌ కుమార్తే ఈ ఇషా తల్వార్‌. డాన్సింగ్, మోడలింగ్, యాక్టింగ్‌ ఇలా మల్టీ టాలెంట్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇషా.. మలయాళ భాషా చిత్రాల్లో ఎక్కువగా మెరిశారు. పాకిస్తాన్‌ మూలాలున్న ఇషా తల్వార్‌.. పుట్టింది, పెరిగింది ముంభైలోనే.

  • 1987 డిసెంబర్‌ 22 జన్మించిన ఇషా.. 2008లో సెయింట్‌ జేవియర్స్‌ కళాశాలలో చదువుకుంది.
  • 2004లో నృత్య దర్శకుడు తెరెన్స్‌ లెవిస్‌ నృత్య పాఠశాలలో చేరి, సల్సా, హిప్‌ హాప్, బాలే, జాజ్‌ వంటి నృత్య రీతులు నేర్చుకుంది. ఆ తరువాత అదే డ్యాన్స్‌ అకాడమీలో టీచర్‌గా కూడా చేరింది.  ‘నన్ను పూర్తిగా మార్చిన వ్యక్తి లెవిస్‌’ అని చెప్పుకుంటుంది ఇషా.
  • ఎన్నో యాడ్స్‌లో మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఇషా.. 2012లో మళయాళ చిత్రం ‘తట్టతిన్‌ మరయతు’తో తెరంగేట్రం చేసింది. అందులో ముస్లిం అమ్మాయిగా కనిపించిన ఇషా తల్వార్‌కు.. విమర్శకుల ప్రశంసలూ అందాయి.

  • పిజ్జా హట్, కాయా స్కిన్‌ క్లినిక్, డ్యూలక్స్‌ పెయింట్స్, మేగీ  హాట్‌ హెడ్స్, వైవల్‌ ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ వంటి కమర్షియల్‌ యాడ్స్‌కి ఇషా తల్వార్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించింది.
  • 2013లో ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో తెలుగులో ఆరంగేట్రం చేసిన ఇషా.. చివరిగా ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమాలో మెరిసింది.
  • మొదటి సినిమా అయిన ‘తట్టతిన్‌ మరయతు’ సినిమాతోనే పలు అవార్డ్స్‌ అందుకున్న ఇషా.. ‘హోమ్‌ స్వీట్‌ ఆఫీస్‌’ అనే వెబ్‌ సిరీస్‌తో మరింత గుర్తింపు తెచ్చుకుంది.
  • ‘తట్టతిన్‌ మరయతులోని  క్యారెక్టర్‌ నాకు చాలా గుర్తింపు తెచ్చింది. ఆ పాత్ర దొరకడం నిజంగా చాలా సంతోషం.. అది నా కెరీర్‌కి ఎంతో ఉపయోగపడింది’ అంటుంది  ఇషా తల్వార్‌.
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు