ఇష్క్‌: సిద్ శ్రీరామ్ వీడియో సాంగ్‌ వచ్చేసింది

24 Jul, 2021 15:00 IST|Sakshi

తేజ సజ్జా, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇష్క్‌’. నాట్‌ ఎ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌. ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ‘ఆనందమా.. ఆనందమదికే’అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌కి  శ్రీమణి లిరిక్స్‌ అందించగా, సిద్‌ శ్రీరామ్‌ ఆలపించాడు.

మరిన్ని వార్తలు