'ఇష్క్'‌ హీరో తేజ వెరీ డెడికేటెడ్‌ ఫెలో..

19 Apr, 2021 11:18 IST|Sakshi

యంగ్ హీరో తేజ స‌జ్జ‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "ఇష్క్"‌. య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నాడు. ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 23న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ పార్క్‌హ‌యాత్ హోట‌ల్‌లో 'ఇష్క్' గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించింది చిత్ర యూనిట్‌. ఈ కార్య‌క్ర‌మంలో ఇష్క్ మూవీ బిగ్ టికెట్‌ని వేణు శ్రీ‌రామ్‌, నారా రోహిత్‌, సందీప్ కిష‌న్‌, నందినీ రెడ్డి, శ్రీ విష్ణు, ప్ర‌శాంత్ వ‌ర్మ సంయుక్తంగా ఆవిష్క‌రించారు.  

ద‌ర్శ‌కురాలు నందినీ రెడ్డి మాట్లాడుతూ.. 'సౌత్ ఇండియాలో వ‌న్ ఆఫ్ ది మోస్ట్ స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్‌ సూప‌ర్ గుడ్ ఫిలింస్. ఈ బ్యాన‌ర్‌లో వ‌ర్క్ చేయ‌డం తేజ‌కి నిజంగా ప్రౌడ్ మూమెంట్‌. సాగ‌ర్‌కి ఈ సినిమా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. ప్రియా చాలా అందంగా ఉంది. ఈ సినిమాతో మ‌రిన్న అవకాశాలు వ‌స్తాయ‌ని ఆశిస్తున్నాను. తేజ‌లో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే ఎంత సేపు మాట్లాడినా సినిమా గురించే మాట్లాడుతాడు. వెరీ డెడికేటెట్ ఫెలో. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్‌. ప్ర‌తి సినిమాని చాలా జాగ్ర‌త్త‌గా సెల‌క్ట్ చేస్తున్నాడు. తేజ‌కు ఇది హ్యాట్రిక్ మూవీ అవ్వాల‌ని కోరుకుంటున్నాను' అన్నారు.

మెగా సూప‌ర్‌గుడ్ ఫిలింస్ అధినేత ఆర్ బి చౌద‌రి మాట్లాడుతూ.. 'ఇది మా బేన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న 94వ చిత్రం. మా బేన‌ర్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులని, టెక్నీషియ‌న్స్‌ని ప‌రిచ‌యం చేశాం. ఇప్పుడు మ‌రో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ య‌స్‌.య‌స్‌. రాజుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేస్తున్నాం. ఇష్క్ సినిమా ఏప్రిల్ 23న థియేట‌ర్‌ల‌లో రిలీజ‌వుతుంది. 23 త‌ర్వాత ఈ మూవీ స‌క్సెస్ మీట్‌లో మ‌ళ్లీ క‌లుద్దాం' అన్నారు. నిర్మాత ఎన్వీ ప్ర‌సాద్ మాట్లాడుతూ.. 'మెగా సూప‌ర్ గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్‌లో `సుస్వాగ‌తం` లాంటి యూత్ కి సంబంధించిన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. ఖ‌చ్చితంగా మిమ్మ‌ల్నంద‌రినీ అల‌రిస్తుంది. తేజ జూనియ‌ర్ ఆర్టిస్టుగా మ‌న‌కు ఎప్ప‌టినుంచో ప‌రిచ‌యం, అయితే ఓబేబి, జాంబీరెడ్డి వంటి స్క్రిప్ట్‌ల‌ను ఎంచుకుంటున్నాడు. ఈ సినిమాలో కూడా ఒక సీనియ‌ర్ యాక్ట‌ర్‌లాగా మంచి పెర్‌ఫామెన్స్ చేశాడు. ప్ర‌స్తుతం యువ హీరోలు ప్ర‌మోష‌న్స్ అనేవి ఒక బాధ్య‌‌తాయుతంగా భావించి వాటిలో భాగం అవ‌డం చాలా హ్యాపీ' అన్నారు. 

‌చిత్ర దర్శకుడు య‌స్‌.య‌స్‌. రాజు మాట్లాడుతూ - 'నేను డైరెక్ట‌ర్ అవ‌డానికి కారణం అయిన మా గురువు గారు స‌మీర్ రెడ్డి గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. అలాగే నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజ‌న్ కుమార్,  జైన్ గారు, వాకాడా అప్పారావు గారికి థ్యాంక్స్‌. ఈ సినిమాను 29 డేస్‌లో ఇంత క్వాలిటీగా చేయడానికి కారణం శ్యామ్‌కేనాయుడు గారు. తేజ‌, ప్రియా, రవీందర్ ఇలా అందరు బాగా చేశారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. నా టీమ్‌లో నాకు స‌హ‌క‌రించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ అవ‌కాశం ఇచ్చిన మెగా సూప‌ర్‌గుడ్ ఫిలింస్ వారికి నా జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను. టీమ్ అంద‌రికీ థ్యాంక్స్‌' అన్నారు. హీరోలు నారా రోహిత్, శ్రీ విష్ణు, సందీప్‌ కిషన్‌ ఈ సినిమా సక్సెస్‌ అవ్వాలని కోరుకున్నారు.

చదవండి: ఒక ముద్దిస్తావా?: ధైర్యం చేసి అడిగేసిన హీరో

'ఇష్క్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు