సుకుమార్‌-దేవి శ్రీ ప్రసాద్‌ కాంబొలో హిట్టైన ఐటమ్‌ సాంగ్స్‌

17 Nov, 2021 14:27 IST|Sakshi

1. అ అంటే అమలాపురం (ఆర్య, 2004)
ఈ పాటలో అభినయ తన అభినయంతో కుర్రకారును ఓ ఊపు ఉపేసింది. అప్పట్లో ఈ స్పెషల్‌ వచ్చిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఈ సాంగ్‌ను బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ హీరోగా చేసిన 'మాక్జిమమ్‌' సినిమాలో రీమేక్‌ కూడా చేశారు. 


2. 36 24 36 (జగడం, 2007)
రామ్ పోతినేని, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం జగడం. గ్యాంగ్‌స్టర్‌ అవ్వాలని తపించే హీరో పెద్ద పేరు తెచ్చుకున్న ఒక గ్యాంగ్‌స్టర్‌ వద్ద చేరి సెటిల్‌మెంట్‌లు చేస్తాడు. ఈ నేపథ్యంలో వచ్చే ఈ సాంగ్‌కి రెస్పాన్స్ మాములుగా రాలేదు. 


3. రింగ రింగ (ఆర్య 2, 2009)
ఆర్య తర్వాత అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో వచ్చిన చిత్రం ఆర్య 2. అ‍ప్పటికే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌కు అంచనాలు పెరిగిపోయాయి. అలా అంచనాలతో వచ్చిన ఈ సాంగ్‌ ఏ ఒక్క అభిమానికి ఉత్సాహన్ని తెచ్చింది. ఇంతే కాకుండా ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్టయ్యాయి. 


4. డియ్యాలో డియ్యాల (100% లవ్‌, 2011)
అక్కినేని నాగ చైతన్య, తమన్నా జంటగా లవ్లీ మూవీ 100% లవ్‌. ఈ చిత్రంలోని అన్ని పాటలు కూడా శ్రోతలను తెగ అలరించాయి. చంద్రబోస్ సాహిత్యమందించిన ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. 


5. లండన్‌ బాబు (1 నేనొక్కడినే, 2014)
సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుతో సుకుమార్‌ తెరకెక్కించిన థ్రిల్లర్‌ చిత్రం 1 నేనొక్కడినే. ఈ సినిమాలో మహేశ్‌ బాబు రాక్‌స్టార్‌ పాత్రలో అలరించారు. హీరో తన తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో లండన్‌ వెళ్తాడు. ఈ నేపథ్యంలో వచ్చే ఈ సాంగ్‌ పర్లేదనిపించింది.


6. జిగేల్‌ రాణి (రంగస్థలం 2018)
అప్పటివరకు అంతగా గుర్తింపు లేని ఆర్టిస్‌లతో స్పెషల్‌ సాంగ్స్‌ చేయించారు డైరెక్టర్‌ సుకుమారు. కానీ జిగేల్‌ రాణిగా మాత్రం హీరోయిన్ పూజ హెగ్డేను చూపించారు. పూజ గ్రేస్‌, డ్యాన్స్‌తో ఆ పాట బ్లాక్‌ బస్టర్‌ అయింది. ఈ సాంగ్‌లో రామ్‌ చరణ్‌కు జోడిగా సూపర్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చింది పూజ.


7. బ్రేకప్‌ ప్యాట్చప్‌ (కుమారి 21F, 2015)
ఈ బ్రేకప్‌ ప్యాట్చప్‌ సాంగ్‌ సుకుమార్‌ కథ అందించి, నిర్మించిన కుమారి 21Fలోది. ఈ సినిమాను పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహించగా.. రాజ్‌ తరుణ్‌, హెబ‍్బా పటేల్‌ హీరోహీరోయిన్‌లుగా నటించారు. 

మరిన్ని వార్తలు