యువ నటుడితో నవ్య నవేలీ ప్రేమ!: స్పందించిన నటుడు

17 Feb, 2021 16:28 IST|Sakshi

బాలీవడ్‌ సూపర్‌ స్టార్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలీ నందా ఈ మధ్య కాలంలో తరచు వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్‌ యువ నటుడు, తన స్నేహితుడు మీజాన్‌ జాఫేరీతో నవ్య ప్రేమలో ఉన్నట్లు బి-టౌన్‌లో కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రిలేషన్‌పై వస్తున్న పుకార్లపై మీజాన్‌ తండ్రి, నటుడు జావేద్‌ జాఫేరీ స్పందించాడు. ఇటీవల ఓ ఇంగ్లీష్‌ ఛానల్‌కు ఇచ్చి ఇంటర్య్వూలో ఆయనకు నవ్య, మీజాన్‌ల ప్రేమ వ్యవహరంపై ప్రశ్న ఎదురైంది. ఇక దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. నవ్య, మీజాన్‌లు కేవలం స్నేహితులు మాత్రమేనని స్పష్టం చేశాడు. ‘నా కూతురు, నవ్య మంచి స్నేహితురాలు. స్కూలింగ్‌ నుంచి వారిద్దరూ కలిసే పెరిగారు. ఈ క్రమంలో మీజాన్‌, నవ్యలు కూడా మంచి స్నేహితులయ్యారు. వారిద్దరికి కొంతమంది కామన్‌ ఫెండ్స్‌ కూడా ఉన్నారు.

ఈ క్రమంలో వారంత అప్పుడప్పుడు కలిసి పార్టీలు, షికార్లకు వెళ్లడం చేస్తుంటారు. అది చూసి కొంతమంది వాళ్ల మధ్య రిలేషన్‌ ఉన్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు వినోదం కావాలి. అందుకే మంచి ఫ్రెండ్స్‌ మధ్య కూడా ఎదో ఉందని పుకార్లు సృష్టించి వారి గురించి చర్చించుకుంటూ వినోదాన్ని పొందుతారు. ఇక చెప్పాలంటే సారా అలీఖాన్‌, నా కొడుకు(మీజాన్‌) కూడా ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. వారిద్దరూ కూడా మంచి స్నేహితులే. కలిసి పార్టీలు, విందులకు వెళుతుంటారు. తెల్లవారు జామును 3 గంటల వరకు వారు పార్టీలంటూ బయట తిరుగుతుంటారు. అంటే ఇక అని వారిమధ్య కూడా ఎదో రిలేషన్‌ ఉన్నట్టా’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే గత నెల నవ్య ఓ రెస్టారెంట్‌లో కుర్చొని ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

దీంతో తన పోస్టుపై మీజాన్‌ ‘వావ్‌ ఈ ఫొటో ఎవరూ తీశారు. చాలా బాగుంది. ఐ వండర్‌’ అంటూ కామెంటు పెట్టాడు.. దీనికి నవ్య మీజాన్‌జీ అనే నా పర్సనల్‌ ఫొటోగ్రాఫర్‌ అంటూ సమాధానం ఇచ్చింది. ఇక అది చూసి అందరూ వీరిమద్య ఎదో ఉందంటూ గుసగుసలాడుకోవడం మొదలు పెట్టారు. కాగా మీజాన్‌ సంజయ్‌ లీలా బన్సాలీ ప్రోడక్షన్‌ నిర్మించిన మలాల్‌ మూవీతో బాలీవుడ్‌ ఆరంగేట్రం చేశాడు. ఆ తర్వాత హంగామా-2లో కూడా నటించాడు. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీలో నటి శిల్పా శెట్టి, పరెష్‌ రావల్‌. పునిత్‌ సుభాష్‌లు కీలక పాత్రలు పోషించారు. ఇక న్యూయార్క్‌లోని ఫోర్థామ్ ‌యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన నవ్య గతేడాది ‘ఆరా హెల్త్‌’ పేరిట ఆన్‌లైన్‌ హెల్త్‌కేర్‌ పోర్టల్‌ను పప్రారంభించింది. అంతేగాక అప్పుడప్పుడు వివిధ ఆరోగ్య సమస్యలకు గల కారణాలపై పలు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫ్లాంలో చర్చిస్తుంటుంది. 

(చదవండి: బిగ్‌బీ కూతురిని చులకనగా చూసిన నెటిజన్‌!)
              (మానసిక సమస్యలలో అమితాబ్‌ మనవరాలు
)
           (వ్యాపార సంస్థను ప్రారంభించిన బిగ్‌బీ మనవరాలు
)

మరిన్ని వార్తలు