జబర్దస్త్ కమెడియన్లకు షాకిచ్చిన సైబర్‌ కేటుగాళ్లు

12 Jan, 2021 14:46 IST|Sakshi

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సినిమా వాళ్లకు సైబర్‌ కేటుగాళ్ల ముప్పు తప్పడం లేదు. సినిమా థియేటర్లలో విడుదల కాకముందే వాటిని ఆన్‌లైన్‌లో లీక్‌ చేసి వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే  తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త చిత్రం 'మాస్టర్' సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టగా.. తాజాగా జబర్దస్త్ కమెడియన్లు అదిరే అభి, గడ్డం నవీన్ నటించిన లేటెస్ట్ మూవీ 'పాయింట్ బ్లాంక్' సినిమాను ఇలాగే లీకైంది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

అదిరే అభి, గడ్డం నవీన్ కీలక పాత్రల్లో ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ కొన్నిపాటి శ్రీనాథ్ నిర్మించిన 'పాయింట్ బ్లాంక్'. సాయి పవన్ సంగీతం సమకూర్చగా.. పి.సి. కన్నా సినిమాటోగ్రఫీ అందించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో విడుదల కానుండగా.. ఇంతలో సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. విడుదలకు ముందే ఈ సినిమాను పలు వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానల్స్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ విషయం తెలుసుకొని చిత్ర దర్శకనిర్మాతలతో పాటు జబర్దస్త్ కమెడియన్ గడ్డం నవీన్ సైబర్ పోలీసులను ఆశ్రయించి తమ ఫిర్యాదు నమోదు చేశారు. ఎంతో కష్టపడి తీసిన తమకు తెలియకుండానే ఇలా ఆన్‌లైన్‌లో లీక్ చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆ ప్రింట్ ఆన్‌లైన్‌లో తీసేయాలని పోలీసులను కోరారు.

మరిన్ని వార్తలు