రాకేష్‌ మరిన్ని సినిమాలు చేయాలి

30 Aug, 2023 00:04 IST|Sakshi
∙రోజా, రాకేష్, సంతోష్‌కుమార్, తనికెళ్ల భరణి ,సాయికుమార్‌

మంత్రి రోజా సెల్వమణి

‘జబర్దస్త్‌’ ఫేమ్‌ రాకింగ్‌ రాకేష్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, తెలంగాణ ఎంపీ (రాజ్యసభ) సంతోష్‌ కుమార్‌ క్లాప్‌ ఇచ్చారు. నటుడు తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించగా, నటుడు సాయికుమార్‌ మేకర్స్‌కి స్క్రిప్ట్‌ అందజేశారు. గ్రీన్‌ ట్రీ ప్రోడక్షన్స్‌ పతాకంపై జయలక్ష్మీ సాయి కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ అంజి దర్శకత్వం వహిస్తుండగా, అనన్యా నాగళ్ల హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈ సినిమాప్రా రంభోత్సవంలో  రోజా మాట్లాడుతూ– ‘‘రాకేష్‌కి ఎప్పట్నుంచో లీడ్‌ రోల్‌ చేయాలని ఉంది. ఈ సినిమాతో అది నెరవేరడం  హ్యాపీగా ఉంది. ఈ సినిమా విజయం సాధించి, భవిష్యత్‌లో రాకేష్‌ మరిన్ని సినిమాలు చేసి, ప్రజలకు వినో దాన్ని పంచాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.‘‘నటుడిగా, నిర్మాతగా రాకేష్‌ మరెన్నో సినిమాలు చేసి, మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు ఎంపీ సంతోష్‌ కుమార్‌. ‘‘చిన్న సినిమాలు పెద్దగా అవుతున్నాయి.

ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి, రాకేష్‌ మరో పది సినిమాలు చేసే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు తనికెళ్ల భరణి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఫౌండర్‌ రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: చరణ్‌ అర్జున్‌. 

మరిన్ని వార్తలు