ఘోరంగా ఉంది.. నాకు కరోనా పాజిటివ్‌: జబర్దస్త్‌ వర్ష

20 Apr, 2021 12:19 IST|Sakshi

కరోనా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ తనకు సమానమేనంటూ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన ఎందరో ప్రముఖులు దీని బారిన పడగా ఇప్పుడిప్పుడే ఆ మహమ్మారి నుంచి కోలుకుంటున్నారు. తాజాగా జబర్దస్త్‌ కమెడియన్‌ వర్ష సైతం కోవిడ్‌ బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.

"సడన్‌గా ఇలా లైవ్‌లోకి వచ్చానేంటని అనుకుంటున్నారా? పరిస్థితులు అలా లైవ్‌లోకి వచ్చేలా చేశాయి. రెండు రోజుల నుంచి ఆరోగ్యం బాగోలేదు. కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకుంటే పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని నేను లైవ్‌లో ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ జరిగేది ఏదీ బయటకు తెలీదు. చనిపోయినవాళ్లను ప్యాక్‌ చేసి విసిరేస్తున్నారు. అది చూడగానే లైవ్‌కి వచ్చి చెప్పాలనుకున్నా.. దయచేసి అందరూ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. వేడినీళ్లు తీసుకోండి. అన్నిరకాల ముందు జాగ్రత్తలు పాటించండి" అని వర్ష కోరింది.

కాగా, సీరియళ్లతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన వర్ష.. బుల్లితెర షోలతో బిజీబిజీగా మారిపోయింది. అందచందాలతో, తన మాటలతో కవ్వించే ఈ బ్యూటీకి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఆమెకు కరోనా సోకడంతో కమెడియన్‌ ఇమ్మాన్యుయేల్‌ ఎలా ఉన్నాడంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఆన్‌స్క్రీన్‌ మీద ఈ జంట బాగా పాపులర్‌ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వర్ష అతడితో కలిసి స్కిట్లు కూడా చేస్తుంది. ఈ క్రమంలోనే ఇమ్మాన్యుయేల్‌ యోగక్షేమాలు ఆరా తీస్తున్నారు అభిమానులు.

చదవండి: సినిమా పరిశ్రమ పరిస్థితి ఏంటి?

పవన్ కల్యాణ్‌కు సోకిన కరోనా!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు