ముంబైలో చిరంజీవి,వెంకటేశ్‌.. సీనియర్ స్టార్స్ సందడి.. ఫోటోలు వైరల్‌

13 Nov, 2022 13:03 IST|Sakshi

80వ దశకంలో కెరీర్ స్టార్ట్ చేసి తమకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ స్టార్స్ అందరూ ఒకేచోట కలిశారు. అలనాటి రోజులను గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్‌ చేశారు. ఈ రీయూనియన్‌ వేడుకకి బాలీవుడ్‌ నటుడు జాపీ ష్రాఫ్‌ ఆదిథ్యం ఇచ్చాడు. ముంబైలో జరిగిన ఈ వేడుకలో టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి, వెంకటేశ్‌, నరేశ్‌, భానుచందర్‌, నదియా, రమ్యకృష్ణ, విద్యాబాలన్‌, సుహాసిని, జయప్రద, రాధ, శోభన, భానుచందర్‌, అనుపమ్‌ ఖేర్‌, శరత్‌ కుమార్‌, అర్జున్‌, అనిల్‌ కపూర్‌ తదితరులు పాల్గొన్నారు.

గేమ్‌ ఆడుతూ..డ్యాన్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఈ సీనియర్‌ నటులు ప్రతి ఏటా రీయూనియన్‌ వేడుక నిర్వహిస్తుంటారు. ఒక్కో ఏడాది ఒక్కో హీరో ఈ వేడుకలను ఆతిథ్యం ఇస్తుంటారు. 2020లో జరిగిన రీయూనియన్‌ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే.
(చదవండి: ‘రంగమ్మ..మంగమ్మ’ పాటకు అక్షయ్‌తో రామ్‌ చరణ్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌)

మరిన్ని వార్తలు