Jacqueline Fernandez: మరోసారి ఈడీ ముందుకు జాక్వెలిన్‌

8 Dec, 2021 18:34 IST|Sakshi

మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరోసారి ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ (ఈడీ)​ ఎదుట హాజరైంది. ఇటీవల ఈ కేసులో ఆమెకు ఇటీవల స్వల్ప ఊరట లభించగా విదేశాలకు వెళ్లేందుకు ఈడీ ఆమెకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల దుబాయ్‌ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లినా ఆమెను విమానాశ్రయం అధికారులు అడ్డుకున్నారు. తన దగ్గరు ఈడీ లుక్‌ అవుట్‌ నోటీసులు చూసి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు నిలిపివేశారు.

చదవండి: మరోసారి పెళ్లికి సిద్దమవుతున్న 7/G బృందావన కాలని హీరోయిన్‌..!

ఈ నేపథ్యంలో ఈ రోజు(డిసెంబర్‌ 8) ఆమె మరోసారి ఈడీ విచారణకు హాజరైంది. వ్యాపారవేత్త సుకేశ్​ చంద్రశేఖర్​కు సంబంధించి రూ. 200 కోట్ల మనీలాండరింగ్​ కేసులో నేడు (డిసెంబరు 8) హాజరుకావాలని ఆమెకు ఈ సోమవారమే సమన్లు జారీ చేసింది ఈడీ. దీంతో జాక్వెలిన్‌ బుధవారం ఉదయం ఢిల్లీలోని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంది. ఆమెను విచారించిన అధికారులు జాక్వేలిన్‌ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ​కాగా జాక్వేలిన్‌ను ఇదివరకు రెండుసార్లు ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. 

చదవండి: ప్రముఖ యూట్యూబ్‌ స్టార్‌ మృతి, దీప్తి సునైనా దిగ్భ్రాంతి

మరిన్ని వార్తలు