Jacqueline Fernandez: కోర్టుకు హజరైన హీరోయిన్‌, ఇంకెందుకు అరెస్ట్‌ చేయలేదంటూ కోర్టు సీరియస్‌

10 Nov, 2022 13:57 IST|Sakshi

మనీలాండరింగ్‌ కేసులో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ నేడు ఢిల్లీలోని పాటియాలా కోర్టుకు హాజరైంది. నిందితుడు సుఖేష్‌ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవల డిల్లీ కోర్టు మధ్యంత బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. నవంబర్‌ 10వ తేదీ వరకు కోర్టు మధ్యంత బెయిల్‌ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆమె గురువారం ఢిల్లీలోని పాటియాలా కోర్టుకు హాజరైంది. ఈ కేసులో రెగ్యులర్‌ బెయిల్‌, ఇతర పెండింగ్‌ దరఖాస్తులపై నేడు కోర్టు విచారణ చేపట్టింది. 

విచారణలో జాక్వెలిన్‌ను ఇంకా ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)ని కోర్టు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా ఆమెకు బెయిల్‌ గడువు పెంచోద్దని, లేదంటే తన సులభంగా దేశాన్ని వదలి పోతుందని ఈడీ కోర్టుకు ఆరోపించింది. తనకు డబ్బు కొరత లేదని, మేం జీవిత కాలంలో రూ. 50 లక్షలు కూడా చూడలేము.. కానీ ఆమె కేవలం తన విలాసాలను రూ. 7 కోట్ల వరకు ఖర్చు పెడుతుందని ఈడీ కోర్టులో పేర్కొంది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న కొందరు ప్రస్తుతం జైలులో ఉన్నారని, మరేందుకు నటిని ఇంకా అరెస్ట్‌ చేయాలేదని కోర్టు ఈడీని ప్రశ్నించింది. అలాగే బెయిల్‌ విచారణ తీర్పును కోర్టు రేపటికి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు