హాలీవుడ్‌ డెబ్యూలో జాక్వెలిన్‌..షూటింగ్‌ ఎక్కడ జరిగిందంటే..

19 May, 2021 18:03 IST|Sakshi

బాలీవుడ్‌ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అంథాల‌జీ ఉమెన్స్ స్టోరీస్‌తో ఈ భామ హాలీవుడ్‌ డెబ్యూ చేస్తున్నట్లు ఈ ఏడాది ప్రకటించింది. మొత్తం ఆరు భాగాలుగా ఈ అంథాల‌జీ కథను తెరకెక్కించనున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా ఆరుగురు మహిళా దర్శకులు ఈ కథలను రూపొందించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నటీనటులతో ఈ సినిమా చేయనున్నారు.

జాక్వెలిన్‌ కథకు సంబంధించి ఈ సినిమాలో ఆమె ఓ  ట్రాన్స్‌జెండ‌ర్ మోడ‌ల్‌తో నటించింది. గతేడాది అక్టోబర్‌లోనే దీనికి సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. చాలా వరకు ముంబైలోనే షూటింగ్‌ను నిర్వహించారు. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్ కానుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో చాలా సినిమాలో ఉన్నాయి. ఇప్పటికే రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాల షూటింగ్‌ను కంప్లీట్‌ చేసుకున్న జాక్వెలిన్‌ జాన్ అబ్రహం,అక్షయ్ కుమార్‌ల యాక్షన్‌ సినిమా షూటింగ్‌ను కూడా పూర్తిచేసింది. లాక్‌డౌన్‌ కారణంగా సల్మాన్‌తో చేస్తున్న కిక్‌-2 సినిమా ఆగిపోయింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం. 

చదవండి : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న అరియానా గ్రాండె
కేంద్రంపై బాలీవుడ్‌ నటి మీరా చోప్రా విమర్శలు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు