బాలీవుడ్‌ భామకి గిఫ్ట్‌గా రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పిల్లి

5 Dec, 2021 14:08 IST|Sakshi

బాలీవుడ్‌ భామ, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రూ.200 కోట్ల మనీ లాండరింగ్‌ కేసు విచారణ ఎదర్కొంటూ జైలులో ఉన్న నిందితుడు సుఖేష్‌ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌కు సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె వాటిని కొట్టిపారేసింది. అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే ఇటీవల అతనితో దిగిన ఫోటో బయటకు రావడంతో ఈ అమ్మడు చుట్టూ ఉచ్చు బిగిసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ శ్రీలంక బ్యూటీపై మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. సుఖేష్‌ నుంచి జాక్వెలిన్‌ కోట్ల రూపాయల బహుమతి పొందినట్లు ఈడీ విచారణలో తేలిందట. అందులో రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పెర్షియన్ పిల్లితో పాటు దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సుఖేష్‌ భార్య లీనా పౌల్‌తో కూడా  జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. జాక్వెలిన్‌‌తో పాటు మరో హీరోయిన్ నోరా ఫతేహీనికి కూడా సుఖేష్‌ భారీ బహుమతులు ఇచ్చాడట. ఆమెకు ఒక బీఎండబ్ల్యూ కారు, ఐఫోన్‌‌తో పాటు మొత్తంగా రూ.కోటి విలువైన గిఫ్టులు ఇచ్చాడని సమాచారం.ప్రస్తుతం ఈ బహుమతుల ఇష్యూ బీటౌన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.
 

మరిన్ని వార్తలు