Jagapathi Babu: 'జగ్గు భాయ్ ఏంటి ఇలా మారిపోయావ్'.. సోషల్ మీడియాలో వైరల్!

21 Sep, 2023 09:08 IST|Sakshi

టాలీవుడ్ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా, ప్రతినాయకుడిగా సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇటీవలే రుద్రంగి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద మెప్పించలేదు. ప్రస్తుతం జగపతిబాబు అల్లు అర్జున్, సుకుమార్ కాంబో తెరకెక్కుతోన్న పుష్ప-2 లో నటిస్తున్నారు. దీంతో ప్రభాస్ సలార్, మహేశ్ బాబు గుంటూరు కారంలోన కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

(ఇది చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!)

అయితే ఇటీవల జగపతిబాబు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. కాస్తా డిఫరెంట్‌గా పోస్టులు పెడుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. గతంలో ఇంట్లో పని చేస్తూ ఉన్న ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా తన ఇన్‌స్టాలో పింక్‌ డ్రెస్‌లో ఉన్న ఫోటోను పంచుకున్నారు. అది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేశారు. వయసు ఎంత పెరిగినా మీరు ఇంకా యువకుడిలాగే ఉన్నారంటూ పోస్టులు పెట్టారు. అయితే జగపతిబాబు ఫ్యాన్స్ కోసమే ఇలా ఉంటూ ఓ ఫోటోను ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. మొహానికి మేకప్‌ వేసుకుని ఉన్న ఫోటోను షేర్ చేశారు. అంతే కాకుండా టిష్యూ పేపర్‌ను అలాగే ఉంచుకుని మరీ ఫన్నీగా కనిపించారు. 

ట్వీట్‌లో రాస్తూ..'ఇంతకు ముందు ఇన్‌స్టాలో పింక్ డ్రెస్‌లో ఉన్న ఫోటోను చూసి నన్ను కుర్రాడి లాగా ఉన్నానని మీరందరు చెప్పారు. అందుకే యెచ్చులు ఎక్కువ అయిపోయాయి. నిజంగానే కుర్రాడు అయిపోదామని నా మొహాన్ని రెడీ చేస్తున్నా.' అంటూ పోస్ట్ చేశారు.  ఇది చూసిన నెటిజన్స్ సైతం మీరు హ్యాండ్సమ్‌ సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా జగపతి బాబు చేస్తున్న ఫన్నీ పోస్టులు అభిమానులకు సరికొత్త థ్రిల్ అందిస్తున్నాయి. 

(ఇది చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి!)

మరిన్ని వార్తలు