Jagapathi Babu: డిప్రెషన్‌లోకి వెళ్లా.. ప్రభాస్‌కి కాల్ చేసి ప్రాబ్లమ్‌ చెప్తే..

19 Sep, 2023 10:35 IST|Sakshi

ఒకప్పుడు హీరోగా రాణించిన జగపతి బాబు ఇప్పుడు విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. టాలీవుడ్‌ స్టైలీష్‌ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక వైపు పాన్‌ ఇండియా సినిమాల్లో నటిస్తూనే..మరోవైపు వెబ్‌ సిరీస్‌ల్లోనూ అదరగొడుతున్నాడు. ఇలా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఫుల్‌ జోష్‌లో ఉన్న జగ్గుభాయ్‌.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరో ప్రభాస్‌, రాజమౌళి ఫ్యామిలీపై ప్రశంసల జల్లు కురిపించాడు. 

రాజమౌళి కుటుంబం అంతా అలానే..
ఎన్ని అవార్డులు వచ్చినా.. ఎంత సాధించిన రాజమౌళి ఫ్యామిలీలో గర్వం కనిపించదు. ఒకరో ఇద్దరు కాదు ఆయన ఫ్యామిలీ అంతా అలానే ఉంటుంది. అందరిని ప్రేమగా చూసుకుంటుంది. వాళ్లు హాలీడే ట్రిప్‌లో కూడా సినిమా గురించే ఆలోచిస్తాడు. నా బంధువే కదా అని తన సినిమాలో పాత్ర అడిగే బాగోదు. రాజమౌళి కూడా అలా మొహమాటంతో ఇచ్చే వ్యక్తి కాదు. తన సినిమాలో పాత్రకు ఎవరు సెట్‌ అవుతారో వారినే తీసుకుంటారు. సినిమా విషయంలో వాళ్లు అంత జాగ్రత్తగా ఉంటారు. రాజమౌళి కుటుంబం నుంచి 20 శాతం నేర్చుకున్న చాలు.

ప్రభాస్‌ది గొప్ప హృదయం
హీరో ప్రభాస్‌కి ఇవ్వడమే కానీ తిరిగి అడగడం తెలియదు. ఎవరే సాయం కావాలన్నా చేస్తాడు. నేను ఓ సారి డిప్రెషన్‌లోకి వెళ్లాను. అప్పుడు ప్రభాస్‌కి ఫోన్‌ చేసి మాట్లాడాలని అడిగా. తను జార్జియాలో ఉన్నాడు. ‘డార్లింగ్‌.. నేనున్నా కదా? నీ ప్రాబ్లమ్‌ చెప్పు.. నేను తీరుస్తా’అని ధైర్యం చెప్పాడు. జార్జియా నుంచి తిరిగి రాగానే నన్ను కలిశాడు. ఆ సయమంలో ప్రభాస్‌ ఓదార్పు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది.  వయసులో నా కంటె చిన్నవాడైనా గొప్ప హృదయం తనది. అందరిని ప్రేమగా ఆదరిస్తాడు’అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు. 

మరిన్ని వార్తలు