అమెరికాలో కుటుంబంతో ఎంజాయ్‌ చేస్తున్న జగపతి బాబు

16 Sep, 2021 11:32 IST|Sakshi

Jagapathi Babu: విలక్షణ నటుడు జగపతి బాబు ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నారు. అమెరికాలో కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ఆయన పేర్కొన్నారు. తన పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘కుటుంబం, పెట్స్‌, బుక్స్‌తో అమెరికాలో సరదాగా గడపటమంటే నాకు ఇష్టం. వీటి నుంచే నిస్వార్థమైన ప్రేమ దొరుకుంది. అది ప్రతి మనిషి గ్రహించాలి’ అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేశారు. 

చదవండి: ముంబై ఎయిర్‌పోర్టులో కరీనాకు చేదు అనుభవం

కాగా ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందిన జగ్గు భాయ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో విలన్‌గా అలరిస్తున్నారు. ప్రతినాయకుడిగా, సహా నటుడిగా ఫుల్‌ బిజీగా మారారు. ఆయన నటించిన ‘టక్‌ జగదీష్‌’ మూవీ ఇటీవల ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఇక శర్వానంద్‌, సిద్దార్థ్‌ ‘మహా సముద్రం’, సాయి ధరమ్‌ తేజ్‌ ‘రిపబ్లిక్‌’ చిత్రాల్లో కీలక పాత్రలో నటిస్తున్నారు. వీటితో పాటు ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రం సలార్‌లో ‘రాజమన్నార్‌’ అనే పవర్‌ ఫుల్‌ విలన్‌గా అలరించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల షూటింగ్‌ దాదాపు చివరి దశకు చేరుకుని విడుదలకు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు విరామ సమయంలో దొరికింది. ఈ ఖాళీ సమయాన్ని సరదాగా గడిపెందుకు కుటుంబంతో కలిసి ఆయన అమెరికాలో వాలిపోయారు.  

చదవండి: Tuck Jagadish Review: ‘టక్‌ జగదీష్‌’ మూవీ రివ్యూ

మరిన్ని వార్తలు