జైలర్‌కు 'తెలుగు' సెంటిమెంట్‌.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు?

31 Jul, 2023 07:04 IST|Sakshi

చిత్ర పరిశ్రమంలో సెంటిమెంట్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఒక చిత్రం హిట్‌ అయితే ఆ తరహాలోనే చిత్రాలను నిర్మించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇకపోతే ప్రస్తుతం జైలర్‌ చిత్రంలో తమన్నా నటించిన కావాలా పాట ట్రెండింగ్‌గా మారింది. రజినీకాంత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్‌. ఇందులో కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌, బాలీవుడ్‌ స్టార్‌ జాకీ ష్రాఫ్‌, తెలుగు నటుడు సునీల్‌, యోగిబాబు, రమ్యకృష్ణ, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ తదితరులు ముఖ్యపాత్ర పోషించారు.

(ఇదీ చదవండి: తరుణ్‌ ఎవరింటి అల్లుడు?)

అయితే వీటన్నింటినీ తమన్నా నటించిన కావాలా పాట పక్కకు నెట్టేసింది. ఇంతకుముందు ఇదేవిధంగా అల్లు అర్జున్‌ పుష్పాలో సమంత నటించిన ఐటెం సాంగ్‌ ఊ అంటావా మామ ట్రెండ్‌ సెట్టర్‌గా మారింది. పలువురు స్టార్‌ హీరోయిన్ల నుంచి విదేశీ భామల వరకు ఈ పాటకు డాన్స్‌ చేసి ముచ్చట తీర్చుకున్నారు. ఇప్పుడు తమన్నా నటించిన కావాలా పాట కూడా కొత్త ట్రెండ్‌ సెట్‌ చేస్తోంది. 52 ఏళ్ల రమ్యకృష్ణ కూడా ముచ్చటపడి ఈ పాటకు డాన్స్‌ చేయడం విశేషం.

ఇకపోతే ఈ చిత్ర కథానాయకుడు రజనీకాంత్‌ కూడా కావాలా పాటపై తన అసూయను వ్యక్తం చేశారు. ఆరు రోజులు చిత్రీకరించిన ఈ పాటలో తనకు ఒక పూట కూడా నటించే అవకాశాన్ని కల్పించలేదనే నిష్టూరాన్ని ఇటీవల జరిగిన ఆడియో వేడుకలో వెలిబుచ్చారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రంలో కావాలా అంటూ తెలుగు పదాలతో ఈ పాట మొదలవుతుంది.

(ఇదీ చదవండి: తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్‌గా దిల్‌రాజు)

ఇంతకుముందు కూడా రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన చంద్రముఖి చిత్రంలో దేవుడ దేవుడా అనే పాట తెలుగు పదాలతో మొదలవుతుంది. ఆ పాట సూపర్‌ హిట్‌ కావడంతో పాటు చిత్రం కూడా ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్‌ జైలర్‌ చిత్రానికి కూడా వర్క్‌ అవుట్‌ అవుతుందా..? లేదా..? అనే విషయం త్వరలో తేలిపోనుంది.

మరిన్ని వార్తలు