Jackie shroff: 36 ఏళ్ల తర్వాత తిరిగి రజనీతో నటిస్తున్న బాలీవుడ్‌ యాక్టర్‌

6 Feb, 2023 08:57 IST|Sakshi

సౌత్‌ స్టార్‌ హీరో రజనీకాంత్, బాలీవుడ్‌ నటుడు జాకీష్రాఫ్‌ మూడు దశాబ్దాల తర్వాత కలిసి నటిస్తున్నారు. రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జైలర్‌’. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాకీష్రాఫ్‌ నటించనున్నారని, ఆయన షూటింగ్‌లో పాల్గొంటున్నారని యూనిట్‌ ప్రకటించింది. కాగా 1987లో వచ్చిన హిందీ చిత్రం ‘ఉత్తర్‌ దక్షిణ్‌’ తర్వాత రజనీకాంత్, జాకీష్రాఫ్‌ మళ్లీ కలిసి నటిస్తున్న సినిమా ‘జైలర్‌’ కావడం విశేషం.

దాదాపు 36 ఏళ్ల తర్వాత రజనీ, జాకీష్రాఫ్‌ కలిసి నటిస్తున్నారన్నమాట. ఇకపోతే ఈ సినిమాలో రజనీకాంత్‌ సరసన తమన్నా హీరోయిన్‌గా నటించనుంది. ఈ మేరకు తమన్నా ఫస్ట్‌ లుక్‌ కూడా ఇటీవల రిలీజైంది. ఈ మూవీలో మాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌తో పాటు కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌, కమెడియన్‌ సునీల్‌ సైతం ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

చదవండి: బ్లాక్‌బస్టర్‌ గీత గోవిందం కాంబినేషన్‌ రిపీట్‌

మరిన్ని వార్తలు