ట్రెండింగ్‌లో 'ఉప్పెన' వీడియో సాంగ్‌..

19 Mar, 2021 12:30 IST|Sakshi

సినిమాకు పాటలతోనే మాంచి హైప్‌ వస్తుందీ రోజుల్లో. అందుకు '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?', 'ఉప్పెన' సినిమాలే లేటెస్ట్‌ ఉదాహరణ. ఇందులోని పాటలు ఎంత హిట్టయ్యాయో, సినిమాలు అంతకు మించి సూపర్‌ డూపర్‌ హిట్టయ్యాయి. కేవలం పాటల కోసమే పని గట్టుకుని థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఇదిలా వుంటే.. గురువారం సాయంత్రం 'ఉప్పెన' చిత్రం నుంచి జలజలజలపాతం నువ్వే.. వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాటను శ్రేయాఘోషల్‌, జాస్‌ప్రీత్‌ జాజ్‌ మనోహరంగా ఆలపించారు. అప్పట్లో కేవలం లిరికల్‌ సాంగ్‌ను మాత్రమే రిలీజ్‌ చేసిన చిత్రయూనిట్‌ తాజాగా ఈ మెలోడి పూర్తి వీడియోను విడుదల చేసింది. ఇది 39 లక్షల పై చిలుకు వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

కాగా వైష్ణవ్‌ తేజ్‌, ఉప్పెన జంటగా నటించిన చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర సూపర్‌హిట్‌ టాక్‌ను సొంతం చేసుకోవడమే కాక వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమాపై పలువురు టాలీవుడ్‌ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే!

చదవండి: వంద కోట్లు: రికార్డులు తిరగరాసిన ఉప్పెన

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు