ఆ నటి ఇంటి ఖరీదు రూ.39 కోట్లు

4 Jan, 2021 19:30 IST|Sakshi

జుహులో ఇల్లు కొన్న శ్రీదేవి తనయ

ముంబైలోని జుహు ప్రాంతం సెలబ్రిటీల కేరాఫ్‌ అడ్రస్‌. బాలీవుడ్‌లో చాలా మంది స్టార్లు ఈ ప్రాంతంలో ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. ధర కూడా భారీగానే ఉంటుంది. ఇప్పటికే అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌, హృతి​క్‌ రోషన్‌ వంటి స్టార్లు ఇక్కడ ఇల్లు కొనుక్కోగా తాజాగా అలనాటి అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ కూడా ఈ జాబితాలో చేరారు. జుహు ప్రాంతంలో జాన్వి ఇల్లు తీసుకున్నారు. దీని ఖరీదు 39 కోట్ల రూపాయలు. ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటి వరకు కేవలం రెండు సినిమాలు మాత్రమే విడుదల చేసిన జాన్వీ కపూర్‌ ఇంత భారీ మొత్తం పెట్టి ఇల్లు కొనడం ప్రస్తుతం బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. (చదవండి: ‘లోలోపల భయంగా ఉన్నా.. పైకి నవ్వేదాన్ని)

స్క్వేర్ ఫీట్ ఇండియా నివేదిక ప్రకారం, జాన్వీ కొన్న కొత్త ఇల్లు జుహు భవనంలో మూడు అంతస్తులలో విస్తరించి ఉంది. ఇక ఇంటి కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం గత ఏడాది డిసెంబర్‌ 7 జరిగిందని నివేదిక తెలిపింది. ఇక ఇంటి విస్తీర్ణం మొత్తం 3,456 చదరపు అడుగులు. ఇంటికి సంబంధించి జాన్వీ ఇప్పటికే 78 లక్షల రూపాయల స్టాంప్‌ డ్యూటీని చెల్లించినట్లు తెలిసింది. 2018లో ధడక్‌ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ఆ తర్వాత గుంజన్‌ సక్సెనా చిత్రంలో నటించారు. ఇక జోయా అక్తర్‌ ఘోస్ట్‌ సిరీస్‌లో కూడా కనిపించారు. ఇక ప్రసుత్తం జాన్వీ దోస్తానా 2, రూహి అఫ్జానా చిత్రాల్లో నటించనున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు