ఫొటోలు: మాల్దీవుల్లో జాన్వీ సందడి

8 Apr, 2021 20:56 IST|Sakshi

బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ మధ్యే రూహీతో ప్రేక్షకులను భయపెట్టిన ఈ హీరోయిన్‌ తాజాగా తన అందచందాలతో కుర్రకారును కవ్విస్తోంది. ఇటీవలే లాస్‌ఏంజిల్స్‌లో చిల్‌ అయిన ఈ భామ తాజాగా మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ సముద్ర తీరాన్ని, అలల సవ్వడిని ఆస్వాదిస్తోంది. ఈ మేరకు పలు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.  ఈ పిక్స్‌ చూసిన ఆమె ఫ్యాన్స్‌ బ్యూటిఫుల్‌, ఏంజెల్‌, లవ్‌లీ.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇదిలా వుంటే జాన్వీ కపూర్‌ ‘ధడక్’ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ఇందులో హీరో ఇషాన్ ఖట్టర్‌తో కలిసి నటించింది. ప్రస్తుతం ఆమె నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ‘ఘోస్ట్ స్టోరీస్’లో నటిస్తోంది. 'గుడ్ లక్ జెర్రీ', కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న 'తఖ్త్', ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'దోస్తానా 2' ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి.

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

చదవండి: లాస్ఏంజిల్స్‌లో చిల్‌ అవుతున్న బాలీవుడ్‌ భామ..‌

ఖరీదైన ఫోన్‌ పోగొట్టుకున్న అల్లు అర్జున్!‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు