న్యూడ్‌గా కనిపించి షాకిచ్చిన జాన్వీ కపూర్‌.. ఫోటో వైరల్‌

25 Jun, 2021 20:22 IST|Sakshi

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ స్కిన్‌ షో విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. సినిమాల హిట్‌, ఫ్లాప్లలతో సంబంధం లేకుండా గ్లామరస్‌ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటుంది. ఆ మధ్య జాన్వీ బికినీలో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఈ మధ్యకాలంలో పాత్ర డిమాండ్‌ చేయాలే కానీ నగ్నంగా నటించేందుకు హీరోయిన్లు ముందుకొస్తున్నారు. సినిమాల్లోనే కాకుండా ఫోటో షూట్‌లోనూ  కూడా నగ్నంగా కనిపించేందుకు రెడీ అంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌ హీరోయిన్లకు అయితే న్యూడ్‌గా, సెమీ న్యూడ్‌గా కెమెరా ముందుకు రావడానికి కామన్‌ అయిపోయింది. ఇటీవలె బాలీవుడ్‌ బ్యూటీ కియరా అద్వానీ నగ్నంగా దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే.

డబూ రత్నానీ ఫొటో షూట్ కోసం టాప్ లెస్ గా పోజులిచ్చింది. ఇప్పుడు ఆ జాబితాలోకి జాన్వీకపూర్‌ కూడా చేరింది. టాప్‌ లెస్‌ ఫోటోతో న్యూడ్‌ లుక్‌లో కనిపించింది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తుంటుంది. తాజాగా ఇన్‌స్టా స్టోరీలో ఈ నగ్నంగా ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. క్యాలెండర్‌ షూట్‌ కోసం ఈ ఫోటో  తీసినట్లు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. జాన్వీ ప్రస్తుతం ‘గుడ్ లక్ జెర్రీ’ అనే సినిమాలో నటిస్తుంది. ‘కోలమావు కోకిల అనే తమిళ రీమేక్‌ ఆథారంగా తెరకక్కుతున్న ఈ చిత్రాన్ని సిద్ధార్థ్‌ సేన్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. 

చదవండి : టాప్‌లెస్‌ ఫోటో షూట్‌.. కియారా అద్వానీ ఫోటో వైరల్‌
ఎంతో ప్రయత్నించాను.. కానీ విడిపోక తప్పలేదు: నటి

మరిన్ని వార్తలు