లాస్ఏంజిల్స్‌లో చిల్‌ అవుతున్న బాలీవుడ్‌ భామ..‌

26 Mar, 2021 09:30 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ తన కొత్త చిత్రం ‘రూహి’ విడుదల తర్వాత చిన్న బ్రేక్‌ తీసుకొని కొంచెం చిల్‌ అవ్వడానికి లాస్ ఏంజిల్స్‌కు వెళ్లింది. ఆమె వెంట సోదరి ఖుషీ, స్నేహితుడు రోహన్ జౌరా కూడా ఉన్నారు. కాలిఫోర్నియాలోని మాలిబు ప్రాంత బీచ్‌ సమీపాన తన పరివారంతో కలిసి సేదతీరుతున్న ఫొటోలను ఈ బ్యూటీ ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ఇందులో మాలిబు తీరంలోని పాయింట్ డ్యూమ్ వద్ద సముద్రం, ఆకాశం కలుస్తున్నట్లు కనిపించే అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడవచ్చు. లిలక్ స్ట్రాపీ టాప్, లావెండర్ ప్యాంటులో ప్రకృతి అందాల మధ్య మరో అందంలా నిల్చున్న జాన్వీ కపూర్ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది.


‘ప్రస్తుతం నేను లాస్‌ఎంజెల్స్‌ ఉన్నప్పటికీ, నాకు మాత్రం మా ఇంట్లో ఉన్నట్టే ఉంది’ అని జాన్వీ చెప్పుకొచ్చింది. కొన్ని రోజుల క్రితం ఓ సరదా వీడియోను సైతం పంచుకుంది. 'మరో ఐస్‌క్రీమ్ స్కూప్ తినడం కోసం నాతో నేనే పోరాడుతున్నా' అంటూ ఫన్నీగా క్యాప్షన్‌ పెట్టింది. ఇదిలా వుంటే తన లేటెస్ట్‌ చిత్రం 'రూహి'లో దెయ్యం పట్టిన మహిళ పాత్రలో నటించిందీ భామ. హార్దిక్ మెహతా దర్శకత్వం వహించిన రూహిలో రాజ్‌కుమార్‌ రావు, వరుణ్ శర్మ నటించారు.


జాన్వీ కపూర్‌ ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో ఇషాన్ ఖట్టర్‌తో కలిసి నటించింది. ఇక జాన్వీ తదుపరి ప్రాజెక్టుల విషయానికి వస్తే నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ‘ఘోస్ట్ స్టోరీస్’ లో నటిస్తోంది. ప్రస్తుతం తనకి గుడ్ లక్ జెర్రీ, కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన తఖ్త్, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న దోస్తానా 2  ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. అతిలోక సుందరి శ్రీదేవి డాటర్‌గా అరంగ్రేటం చేసిన జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో తల్లికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)


( చదవండి : జాన్వీ కపూర్‌ని ముద్దడిగిన ఫ్యాన్‌.. తన రిప్లై చూస్తే.. )

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు