అవి ఉంటేనే మజా!

5 Feb, 2021 00:23 IST|Sakshi

‘‘ఒకే తరహా పాత్రలు చేయడం నాకిష్టం లేదు. నటిగా వీలైనంత విభిన్నతను చూపించాలనుంది’’ అన్నారు జాన్వీ కపూర్‌. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు సినిమాల వయసున్న నటి. ‘ధడక్‌’తో బాలీవుడ్‌కి పరిచయం అయ్యారామె. ఆ తర్వాత ‘కార్గిల్‌ గాళ్‌’ అనే లేడీ ఓరియంటెడ్‌ సబ్జెక్ట్‌ చేశారు. ప్రస్తుతం తమిళ చిత్రం ‘కోకో’ హిందీ రీమేక్‌ ‘గుడ్‌ లక్‌ జెర్రీ’లో నటిస్తున్నారామె. నటిగా ఎలాంటి సినిమాలు చేయాలనుందనే విషయం గురించి జాన్వీ మాట్లాడుతూ– ‘‘నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే పాత్రల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నటిగా నన్ను ఛాలెంజ్‌ చేసే కథల్లో కనిపించాలని అనుకుంటున్నాను. నాకు సవాళ్లు కావాలి. అప్పుడే మజా ఉంటుంది. నా మొదటి రెండు సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. నటిగా నాకెంత సామర్థ్యం ఉందో తదుపరి సినిమాల ద్వారా చూపించాలనుకుంటున్నాను’’ అన్నారు. ‘గుడ్‌ లక్‌ జెర్రీ’, దోస్తానా 2, రూహీ అఫ్జా, తక్త్‌’ సినిమాలు చేస్తున్నారు జాన్వీ కపూర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు