కోకిలగా జాన్వీ

2 Oct, 2020 05:58 IST|Sakshi

2018లో నయనతార నటించిన లేడీ ఓరియంటెడ్‌ చిత్రం ‘కోకో (కోలమావు కోకిల). తమిళ తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్‌ కాబోతోంది. నయనతార చేసిన పాత్రను జాన్వీ కపూర్‌ చేయనున్నారని సమాచారం. ఈ హిందీ రీమేక్‌ను దర్శకుడు ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ నిర్మించనున్నారు. సిద్ధార్థ్‌ సేన్‌ గుప్తా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో అనుకోకుండా డ్రగ్స్‌ రాకెట్‌లో చిక్కుకొని డ్రగ్స్‌ను స్మగ్లింగ్‌ చేసే అమ్మాయి పాత్రలో జాన్వీ కనిపించనున్నారు. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు