Janhvi Kapoor: జాన్వీకి తల్లి శ్రీదేవి చెప్పిన బ్యూటీ సీక్రెట్‌ ఇదే..

24 Jul, 2022 15:36 IST|Sakshi

దివంగత నటి శ్రీదేవి (Sridevi) అందానికి అడ్రస్‌ లాంటివారు. అందుకే ఆమెను అతిలోక సుందరి అంటారు. ఆమె సాధించిన పేరు ప్రఖ్యాతలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దక్షిణాది నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన ఆమె అందానికి, అభినయానికి అక్కడి ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఆమె అందాన్ని వారసత్వంగా తీసుకున్న జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) కూడా ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటోంది. నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటనకు పదును పెడుతోంది. 

అయితే తాజాగా జాన్వీ కపూర్‌ ఒక బ్యూటీ సీక్రెట్‌ను పంచుకుంది. అది కూడా వాళ్ల అమ్మ (శ్రీదేవి) చెప్పిన రహస్యమట. తాను ఇంత అందంగా మిలమిల మెరిసిపోవడానికి కారణం ఆమె తల్లి శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్‌ అని చెప్పుకొచ్చింది. 'మా అమ్మ.. బ్రేక్‌ఫాస్ట్‌లో తినగా మిగిలిపోయిన పళ్ల ముక్కలతో అప్పటికప్పుడే అక్కడికక్కడే మొహానికి మసాజ్‌ చేసుకుని ప్యాక్‌లా వేసుకునేది. ఓ పదిహేను నిమిషాలు ఆగి కడిగేసేది. అప్పుడు చూడాలి అమ్మ మొహం.. మిలమిల మెరిసిపోయేది. ఇప్పుడు నేనూ అదే ఫాలో అవుతున్నా. బ్రేక్‌ఫాస్ట్‌లో మిగిలిపోయిన పళ్ల ముక్కలే నా బ్యూటీ సీక్రెట్‌' అని జాన్వీ కపూర్‌ తెలిపింది. 

చదవండి: అన్నదమ్ములతో డేటింగ్‌ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్‌
'గాడ్‌ ఫాదర్‌' షూటింగ్‌.. చిరంజీవి, సల్మాన్‌ ఫొటో లీక్‌

కాగా జాన్వీ నటించిన 'గుడ్‌ లక్‌ జెర్రీ' మూవీ నేరుగా ఓటీటీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో జులై 29 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రం సౌత్ లేడీ సూపర్ స్టార్‌ నయనతార నటించి హిట్‌ కొట్టిన తమిళ చిత్రం 'కోలమావు కోకిల'కు రీమేక్‌గా తెరకెక్కింది. హిందీలో మాత్రం బాలీవుడ్‌ నేటివిటీకి తగినట్లు స్టోరీలో మార్పు చేశారని ఇటీవల జాన్వీ తెలిపింది. ఈ చిత్రానికి డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ సేన్‌ గుప్త దర్శకత్వం వహించారు. 

చదవండి: భర్త న్యూడ్ ఫొటోలు తీసిన హీరో భార్య.. వైరల్‌

మరిన్ని వార్తలు