రణ్‌వీర్‌ షోలో బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టిన జాన్వీ.. ఎంజాయ్‌ చేసిన సారా

23 Oct, 2021 18:37 IST|Sakshi

ఒకరు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌.. మరొకరు బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ కూతురు సారా అలీఖాన్‌. స్టార్‌ వారసురాళ్లుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీస్‌ అనంతరం తమ అందచందాలతో పాటు నటనతోనూ ఫ్యాన్స్‌ హృదయాలను కొల్లగొట్టారు. ఈ అందగత్తెలు తాజాగా బెల్లీ డాన్స్‌ వేసి మరోసారి అందరి మనసులను దొచుకున్నారు.

బాలీవుడ్‌ స్టార్స్‌ అమితాబ్‌, సల్మాన్‌ ఖాన్‌ బాటలో పయనిస్తూ రణ్‌వీర్‌సింగ్‌ ‘ది బిగ్‌ పిక్చర్‌’ అనే షోకి హోస్ట్‌ చేస్తున్నాడు. ఈ షో కలర్స్‌ టీవీలో ప్రసారమవుతోంది. తాజాగా జాన్వీ, సారా గెస్ట్స్‌గా వచ్చిన ఎపిసోడ్‌ ప్రొమోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది టీవీ మేనేజ్‌మెంట్‌. అందులో జాన్వీ గతంలో బెల్లీ డ్యాన్స్‌ నేర్చుకుందని చెప్పింది. దీంతో తమకు దాన్ని నేర్పించమని అడిగాడు రణ్‌వీర్‌. తన నడుమును వయ్యారంగా ఊపుతూ వారికి చూపించింది ఈ బ్యూటీ. ప​క్కనే ఉన్న సారా ఆమెను ఉత్సాహపరుస్తూనే తను సైతం బెల్లీ డ్యాన్స్‌ చేయడానికి ప్రయత్నించింది. ఇద్దరూ అందాల భామలు చేసిన ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

A post shared by ColorsTV (@colorstv)

మరిన్ని వార్తలు