అభిమాని కోసం హీరోయిన్‌ ఆవేదన!

9 Mar, 2021 15:06 IST|Sakshi

హీరో, హీరోయిన్లను ప్రేక్షకులు అభిమానిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే! కానీ అభిమానుల గురించి ఆలోచించే వాళ్లు, వారి కోసం పరితపించే నటీనటులు కొద్ది మందే ఉంటారు. బాలీవుడ్‌ క్యూటీ జాన్వీ కపూర్‌ కూడా ఈ కోవలోకే వస్తుంది. ఎందుకో తెలియాలంటే ఇది చదివేయండి..

ముంబై ఎయిర్‌పోర్టులో ఓ అభిమాని జాన్వీ కపూర్‌తో సెల్ఫీ దిగేందుకు తెగ ప్రయత్నించాడు. కానీ సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. అయినా అతడు ఫొటో కోసం యత్నిస్తుండటంతో వాళ్లు అతడిని నెట్టివేశారు. అప్పటికే మరో అభిమానితో సెల్ఫీ దిగుతున్న ఆమె తనతో ఫొటో కోసం ట్రై చేస్తున్న ఫ్యాన్‌ను సమీపించి సెల్ఫీకి పోజిచ్చింది. కానీ తన భద్రతా సిబ్బంది అతడి పట్ల దురుసుగా ప్రవర్తించడం పట్ల జాన్వీ విచారం వ్యక్తం చేసింది. సెక్యూరిటీ వాళ్లు అలా స్పందించాల్సింది కాదని బాధపడింది. అతడు సంతోషంగానే ఇంటికి చేరుకుని ఉండాటని భావిస్తున్నట్లు ఆశించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక అభిమాని మనసు ఎక్కడ నొచ్చుకుందోనని బాధపడ్డ జాన్వీని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

కాగా జాన్వీ ప్రస్తుతం రూహి సినిమా చేస్తోంది. హార్దిక్‌ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాడ్‌డాక్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై దినేశ్‌ విజన్‌ నిర్మిస్తున్నాడు. హనీమూన్‌కు వెళ్లిన వధువును దెయ్యం ఎత్తుకెళ్లిన కథే ఈ రూహి. రాజ్‌కుమార్‌ రావు, వరుణ్‌ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

చదవండి: వైరల్‌: దుమ్మురేపుతోన్న జాన్వీ బెల్లి డ్యాన్స్‌

ఆ కాలంలో ఒకరోజు! 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు