-

NTR In Japan: విదేశాల్లో జూనియర్ ఎన్టీఆర్‌ క్రేజ్.. బోరున విలపించిన మహిళా అభిమాని

21 Oct, 2022 19:38 IST|Sakshi

జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజే వేరు. టాలీవుడ్‌, బాలీవుడ్‌లోనూ ఆయనకు విపరీతమైన క్రేజ్‌ ఉంది. ప్రస్తుతం జపాన్‌లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో ఎన్టీఆర్‌ బిజీగా ఉన్నారు.  మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్న ఎన్టీఆర్‌కు అక్కడ ఘనస్వాగతం లభించింది. ఓ హోటల్‌లో బస చేసేందుకు వెళ్లగా జపానీయులు ఎన్టీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. విదేశాల్లో కూడా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ ఉందంటే ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ ఆటోగ్రాఫ్‌ అడగ్గా.. వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ను చూసిన ఓ మహిళ అభిమాని భావోద్వేగానికి గురైంది. జూనియర్‌ను చూసిన ఆనందంలో చిన్న పిల్లలా బోరున ఏడ్చేసింది. ఆ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

(చదవండి:జపాన్‌లో తారక్‌కు అరుదైన స్వాగతం, వీడియో వైరల్‌)

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సంచలన మూవీ 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీస్థాయిలో వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమాను జపాన్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. అందుకోసం ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రమోషన్లు సైతం ప్రారంభించింది. ఇందుకోసం కుటుంబ సమేతంగా జపాన్‌కు చేరుకున్నారు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి. ఇవాళ జపాన్ రాజధాని టోక్యోలో 'ఆర్ఆర్ఆర్' ప్రీమియం షో ప్రదర్శించనున్నారు.

మరిన్ని వార్తలు