జపాన్‌ రేంజే వేరు

19 Oct, 2023 04:09 IST|Sakshi

‘హార్ట్‌ ఆఫ్‌ ది సిటీలో ఒకడు కన్నమేసి రెండు వందల కోట్ల రూపాయల విలువ చేసే నగలు ఎత్తుకుపొతే మీ లా అండ్‌ ఆర్డర్‌ లాఠీ ఊపుతూ కూర్చుందా?’ అనే డైలాగ్‌తో ‘జపాన్‌’ చిత్రం టీజర్‌ విడుదలైంది. కార్తీ హీరోగా రాజు మురుగన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘జపాన్‌’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటించారు.

డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌పై ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో దీపావళికి విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ని బుధవారం విడుదల చేశారు. ‘‘ఇండియా అంతటా జపాన్‌పై (కార్తీ పాత్ర పేరు) 182 కేసులున్నాయి. నాలుగు రాష్ట్రాల పొలీసులు వాడి కోసం వెతుకుతున్నారు. కానీ, ఒక్కసారి కూడా వాడు ఎవ్వరికీ దొరకలేదు’, ‘జపాన్‌ రేంజే వేరు’ వంటి డైలాగులు టీజర్‌లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌. 

మరిన్ని వార్తలు