ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ కేసు : అక్కాచెల్లెళ్ల వీడియో వైరల్‌

24 Apr, 2021 16:16 IST|Sakshi

టీవీ చానల్స్ లో అవకాశం ఇస్తానంటూ మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. భార్గవ్‌ని రిమాండ్‌కు తరలించిన తర్వాత అతని బాగోతాలన్ని ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అతను కెమెరా ముందు ఒకలా.. తర్వాత మరోలా ఉంటాడని చాలామంది అమ్మాయిలు చెబుతున్నారు. గతంలో కూడా చాలా మంది అమ్మాయిలను అవకాశాల పేరుతో మోసం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. భార్గవ్‌ అత్యాచారానికి పాల్పడిన 14 ఏళ్ల బాలిక స్థానంలో ఎందరో పేర్లు బయటకు వస్తున్నాయి.

గతంలో భార్గవ్‌తో కలిసి వీడియోలు చేసిన OMG నిత్య, ‘అమ్మాయి-అబ్బాయి’ఫేమ్‌ మౌనిక పేర్లు కూడా బయటకు వచ్చాయి.  దీంతో చేసేదేమీలేక సదరు యువతులు ఓ వీడియో సందేశం ద్వారా ఆ బాధితురాలిని మేము కాదని చెప్పుకున్నారు. తాజాగా భార్గవ్‌ అత్యాచారం పాల్పడింది ఈ అమ్మాయిపైనే అంటూ కొన్ని యూట్యూబ్‌ చానళ్లు భార్గవ్‌తో గతంలో వీడియోలు చేసిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు పేర్లను, ఫోటోలనే వాడేస్తున్నారు. అయితే ఆ అమ్మాయి మేము కాదంటూ జస్విక, మేఘన అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ తండ్రితో కలిసి ఓ వీడియోను షూట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ వుతుంది.

ఆ వీడియోలో జస్విక మాట్లాడూ.. ‘బార్గవ్‌ అన్నయ్య కేసు గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. అందులో ఫీమెల్‌గా ఫస్ట్‌ మా అక్కను, తర్వాత నన్ను అనుకుంటున్నారు. దాని వల్ల చాలా కామెంట్స్‌ వస్తున్నాయి. క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. భార్గవ్‌ కేసులో మైనర్‌ వయసు 14 ఏళ్లు. కానీ మా అక్క వయసు 20 ఏళ్లు, నాకు 16 ఏళ్లు. ఈ జూన్‌ వస్తే 17 ఏళ్లు వస్తాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగా చాలా మంది మీరు సేఫా? అని మెసేజ్‌లు పెడుతున్నారు. మాకేమి ప్రాబ్లమ్‌ లేదు. మా వీడియోస్ అన్నీ మా డాడీయే చూసుకుంటారు’ అని జస్విక వెల్లడించింది.

ఇక జస్విక తండ్రి మాట్లాడుతూ.. ‘మా పిల్లల వీడియోస్‌ని అన్ని నేనే చూసుకుంటా. రెండు నెలల నుంచి భార్గవ్ కోసం వర్క్ చేస్తున్నా.ఇన్ని రోజులు మా ఛానల్‌లో వీడియో పెట్టడం కుదరడం లేదు. మా పిల్లలిద్దరికీ నటనంటే ఇష్టం. నేను 20 ఏళ్లుగా సినిమాల్లో వర్క్ చేస్తున్నాను. నా వీడియోపై బ్యాడ్ కామెంట్స్ ఏమీ పెట్టకండి. నేను అన్నీ స్క్రీన్ షాట్ తీస్తున్నా. అవన్నీ సైబర్‌క్రైమ్‌కు వెళ్తాయి. బెదిరించడంలేదు. దయచేసి అర్థం చేసుకోండి’అని విజ్ఞప్తి చేశారు.  


చదవండి:
భార్గవ్‌.. మమ్మల్ని రూమ్‌ నుంచి వెళ్లగొట్టాడు, ఎందుకంటే
టిక్‌టాక్ భార్గవ్ నిజరూపం బయటపెట్టిన పోలీసులు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు