ఆ సీక్వెల్‌కు చిట్టి ఓకే చెప్పిందా?

16 Jun, 2021 12:08 IST|Sakshi

హీరో మంచు విష్ణు కెరీర్‌లో 'ఢీ' చిత్రానిది ప్రత్యేక స్థానం. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ బ్లాక్‌బస్టర్‌ సినిమాలో జెనీలియా కథానాయికగా ఆకట్టుకుంది. శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్‌, చంద్రమోహన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. 2007లో విడుదలైన ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని శ్రీనువైట్ల ప్రకటించిన విషయం తెలిసిందే. ఢీలో ఉన్న కామెడీ, యాక్షన్‌ ఈ సీక్వెల్‌లో రెట్టింపు ఉంటాయనే ఉద్దేశంతో 'డబుల్‌ డోస్‌' అనే ట్యాగ్‌లైన్‌ పెట్టారు. 

ఈ సినిమాలో నటించబోయే ముద్దుగుమ్మ గురించి ఫిల్మీదునియాలో ఆసక్తికర వార్త గింగిరాలు తిరుగుతోంది. జాతిరత్నాలు ఫేమ్‌ ఫరియా అబ్దుల్లాను 'ఢీ అండ్‌ ఢీ' కోసం సంప్రదించారట. చిట్టి కూడా ఈ సీక్వెల్‌లో నటించేందుకు ఓకే చెప్పిందని టాక్‌ నడుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. 

ఇక ఢీ సినిమా గురించి శ్రీను వైట్ల మాట్లాడుతూ.. 'ఢీ' కథ, ఈ సీక్వెల్‌ కథ రెండూ వేర్వేరని తెలిపాడు. కాకపోతే 'ఢీ'లో ఉండే కొన్ని క్యారెక్టర్లను మాత్రం సీక్వెల్‌లో వాడుకోబోతున్నట్లు పేర్కొన్నాడు. గత సినిమాల్లోని తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తపడతానన్నాడు. 'ఢీ అండ్‌ ఢీ'ని 24 ఫ్యాక్టరీ ఫిలింస్‌ పతాకంపై హీరో మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. గోపీమోహన్, కిషోర్‌ గోపులు రచయితలుగా చేస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: అవ్రామ్‌ భక్త మంచు, సంగీతం: మహతి స్వరసాగర్, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌.

చదవండి: సెట్టుకి వెళదాం.. షూటింగు చేద్దాం... ఛలో ఛలో

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు