ప్రొడ్యూసర్స్‌ ఇచ్చిన గిఫ్ట్‌తో అనుదీప్‌ మైండ్‌ బ్లాక్‌

3 Apr, 2021 12:44 IST|Sakshi

నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రలో అనుదీప్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘జాతి రత్నాలు’.థియేటర్‌లోకి అడుగు పెట్టిన ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు.  చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన సంగతి తెలిసిందే. నిర్మాతలకు కాసుల పంట కురిపించింది. దీంతో డైరెక్టర్‌ అనుదీప్‌కు స్వప్నా సినిమా బ్యానర్‌ అదిరిపోయే గిప్ట్‌ ఇచ్చింది. ప్రొడ్యూసర్స్‌ స్వప్న దత్‌, ప్రియాంక దత్‌లు కాస్ట్‌లీ లంబోర్గిని కారును బహుమతిగా ఇచ్చారు.

అయితే ఇది నిజమైన కారు కాదు..లంబోర్గిని మోడల్‌లోని ఓ బొమ్మకారును అనుదీప్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నా పంచులతో అందరినీ అందరినీ ఫూల్స్‌ చేస్తుంటే..వీళ్లు బొమ్మ కారిచ్చి నన్నే ఫూల్‌ని చేస్తున్నారు అంటూ అనుదీప్‌ చెబుతున్నట్లు కొన్ని మీమ్స్‌ ట్రెండ్‌ అవుతున్నాయి. ఇప్పటికే అనుదీప్‌ తన పంచులు, కౌంటర్‌లతో హీరోకు సమానంగా పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 

A post shared by Arey Entra Edi 😂 (@na_page_ni_rechagotaku)

చదవండి:  బాహుబలి రికార్డును బ్రేక్‌ చేసిన జాతిరత్నాలు!
'ఆస్కార్'‌ బరిలో జాతిరత్నాలు!

మరిన్ని వార్తలు