'చిట్టి' డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్‌

21 May, 2021 19:38 IST|Sakshi

తొలి సినిమాతోనే భారీ హిట్‌ కొట్టేసింది హీరోయిన్‌ ఫ‌రియా అబ్ధుల్లా. జాతిరత్నాలు సినిమాతో చిట్టిగా అలరించి ప్రేక్షకుల మనసును దోచుకుంది ఈ హైద‌రాబాదీ బ్యూటీ. చిన్నసినిమాగా విడుదలైన జాతిరత్నాలు మూవీ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన సంగతి తెలిసిందే. ఓవర్సీస్‌లోనూ ఈ మూవీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిల అమాకత్వపు పనులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇక జాతిరత్నాలుతో నవీన్‌ పొలిశెట్టికి ఎంత క్రేజ్‌ వచ్చిందో.. ఫరియాకు అంతే వచ్చింది.  సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది హీరోయిన్‌ ఫరియా. ఈ మధ్యకాలంలో డ్యాన్స్‌పై తనకున్న ఇష్టాన్ని బయటపెడుతూ సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్ట్‌ చేస్తుంది.

తాజాగా మరోసారి తన డ్యాన్సింగ్‌ టాలెంట్‌ని బయటపెట్టేసింది. ‘ఆజా రీ మోర్ సైయన్’ పాటకు తనదైన స్టైల్‌లో డ్యాన్స్ చేసి మరోసారి  ఫిదా చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం టాలీవుడ్‌ హీరోయిన్లలో అత్యంత పొడగరిగా మరో క్రేజ్‌ను సొంతం చేసుకుంది ఈ భామ. ఈ కారణంగానే ఆమె క్రేజీ ఆఫర్లను రిజెక్ట్‌ చేసినట్లు సమాచారం. ఆమెకు వచ్చిన ఆఫర్లలో హీరోల హైట్‌ ఆమెకంటే చాలా తక్కువట. అందుకే ఆ సినిమాలను ఫరియా సున్నితంగా తిరస్కరించిందట. తనకంటే తక్కువ హైట్‌ ఉన్నహీరోలతో నటించేందుకు ఫరియా మొగ్గు చూపడంలేదని తెలుస్తోంది. మరోవైపు ఫరియా బాలీవుడ్‌ చాన్స్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు మూడు కథలు కూడా విన్నట్లు వార‍్తలు వినిపిస్తున్నాయి.  

చదవండి : హీరోయిన్‌ అను ఇమాన్యుయేల్‌కు నెటిజన్‌ వెరైటీ లవ్‌ ప్రపోజల్‌
'టౌటే'తో బాల్కనీ పైకప్పు కూలిపోయింది: నటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు