అమెజాన్‌లో జాతిరత్నాలు: నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత!

7 Apr, 2021 13:46 IST|Sakshi

ఈ మధ్య కాలంలో ప్రేక్షకుడిని బాగా నవ్వించిన సినిమా జాతిరత్నాలు. కథ కన్నా కామెడీ మీద దృష్టిపెట్టిన డైరెక్టర్‌ అనుదీప్‌ ప్రజలను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడంలో సక్సెస్‌ సాధించాడు. మార్చి 11న రిలీజైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ మంచి విజయం సాధించింది.

ప్రధాన తారాగణం నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లాకు మంచి అవకాశాలను సైతం తెచ్చిపెట్టింది. ఇక కరోనా భయంతో థియేటర్‌కు వెళ్లలేని ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ కోసం తహతహలాడిపోతున్నారు. తాజాగా వారికి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో శుభవార్త చెప్పింది. జాతిరత్నాలు సినిమా ఏప్రిల్‌ 11 నుంచి ప్రసారం కానున్నట్లు వెల్లడించింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఈ సినిమా హిందీ, కన్నడ డబ్బింగ్‌ కావాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: 'ఆస్కార్'‌ బరిలో జాతిరత్నాలు!

మళ్లీ అనారోగ్యానికి గురైన సీనియర్‌ నటుడు కార్తీక్

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు