Jawan Box Office Collections: 7 రోజులు.. రూ.600 కోట్లు.. ‘జవాన్‌’ సరికొత్త రికార్డు

14 Sep, 2023 14:50 IST|Sakshi

సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజే రూ. 75 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బాద్ షా స్టామినా ఏంటో నిరూపించింది. వీకెండ్‌తో పాటు వీక్‌ డేస్‌లో కూడా మంచి కలెక్షన్స్‌ని రాబట్టింది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.570 కోట్ల వసూళ్లను సాధించి చరిత్రకెక్కింది. ఇక ఏడో రోజు కూడా జవాన్‌ మంచి వసూళ్లనే సాధించాడు. ఏడో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 44 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలుపుతున్నాయి. మొత్తంగా ఈ చిత్రం వారం రోజుల్లో రూ. 621 కోట్లు వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. 

జావాన్‌ ఖాతాలో అరుదైన రికార్డు
విడుదలైన తొలి రోజు జవాన్‌ చిత్రానికి బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వచ్చింది. దీంతో కలెక్షన్స్‌ భారీగా పెరిగాయి. ముఖ్యంగా హిందీలో రోజు రోజుకి కలెక్షన్స్‌ సంఖ్య పెరుగుతోంది. దక్షిణాదికి చెందిన నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించడంతో అక్కడ కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. మొత్తంగా వారం రోజుల్లో రూ. 600 కోట్ల మార్క్‌ని దాటిన తొలి హిందీ చిత్రంగా జవాన్‌ అరుదైన రికార్డుని సాధించింది.

(చదవండి: మాట నిలబెట్టుకున్న విజయ్‌.. రూ. కోటి పంపిణీకి లిస్ట్‌ రెడీ!)

అలాగే ఈ ఏడాదిలో షారుఖ్‌ నటించిన రెండు చిత్రాలు (పఠాన్‌, జవాన్‌) కూడా 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించడం గమనార్హం. పఠాన్‌ తొలి రోజు రూ. 57 కోట్లు సాధిస్తే.. జవాన్‌ రూ. 75 కోట్లు వసూళ్లు రాబట్టింది. అలాగే ఒకే ఏడాదిలో ఒక హీరో నటించిన రెండు సినిమాలు.. తొలి రోజు రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించిన ఏకైన ఇండియన్‌ స్టార్‌గా షారుఖ్‌ చరిత్రకెక్కాడు.

అంతేకాదు అతి తక్కువ రోజుల్లో రూ. 250 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించిన తొలి చిత్రం కూడా ఇదే. అంతకు ముందు  బాహుబలి 2 హిందీ వెర్షన్ 250 మార్కును స్కోర్ చేయడానికి 8 రోజులు పట్టింది. ఆ తర్వాత కేజీయఫ్‌ 2, పఠాన్‌ చిత్రాలు ఐదు రోజుల్లో ఈ మ్యాజిక్‌ ఫిగర్‌ని చేరుకుంది. జవాన్‌ మాత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.

మరిన్ని వార్తలు