Jawan: లుంగీ డాన్స్‌తో దుమ్ము రేపిన షారూఖ్ ఖాన్‌, ప్రియ‌మ‌ణి

7 Aug, 2023 10:53 IST|Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్‌ చిత్రంలో లుంగీ డాన్స్‌ సాంగ్‌ ఎంత పాపులర్‌ అయిందో అందరికి తెలిసిందే. ఆ పాటకు ప్రియమణితో కలిసి షారుఖ్‌ అదిరిపోయే స్టెప్పులేశాడు. తాజాగా ఈ జోడి మరోసారి లుంగీ డాన్స్‌తో అదరగొట్టింది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్‌ నటిస్తోన్న చిత్రం జవాన్‌. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘దుమ్మే దులిపేలా..’సాంగ్‌ రిలీజ్‌ అయింది. ఇందులో దాదాపు 1000 మందితో కలిసి షారుఖ్‌ స్టెప్పులేశాడు. బ్యాగ్రౌండ్‌లో ఉండే 1000 డ్యాన్సర్స్‌ లుంగీ కట్టుకొని డ్యాన్స్‌ చేయడం ఈ పాట స్పెషల్‌.

ఇందులో ప్రియమణి మరోసారి కింగ్‌ ఖాన్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది.  1,2,3,4 గెట్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్ అంటూ షారూక్, ప్రియ‌మ‌ణిని మ‌రోసారి చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయ‌బోతున్నారు. లార్జ‌ర్ దేన్ లైఫ్ విజువ‌ల్స్‌, పాజిటివ్ ఎన‌ర్జీతో ఈ పాట షారూఖ్‌కి మ్యూజిక్‌పై ఉన్న క‌నెక్ష‌న్‌ను ఎలివేట్ చేస్తోంది. ఈ పాట‌కు 24 గంట‌ల్లోనే 46 మిలియ‌న్ వ్యూస్ రావ‌టం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ ఈ సినిమాకు స‌హ నిర్మాత‌. సెప్టెంబ‌ర్ 7న ‘జ‌వాన్‌’ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.

మరిన్ని వార్తలు