KBC: అమితాబ్‌పై జయా బచ్చన్‌ ఫిర్యాదు!

30 Nov, 2021 20:28 IST|Sakshi

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌ చేస్తున్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ షో ప్రస్తుతం 13వ సీజన్‌ను జరుపుకుంటోంది. అయితే ఈ సిజన్‌లో కేబీసీ ఓ 1000వ ఎపిసోడ్‌ మైలురాయిని చేరుకుంది. అయితే ఈ సందర్భంగా హాట్‌ సీట్లో కూర్చొని క్విజ్‌లో పాల్గొనడానికి తన కూతురు స్వేతా బచ్చన్‌, మనవరాలు నవ్వా నవేలీ నందాలను అమిత్‌ ఆహ్వానించారు.

దీంతో పాటు అమితాబ్‌ భార్య జయా బచ్చన్‌.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా షోకి గెస్ట్‌గా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమోను ‘సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్’ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. గతంలో విడుదల చేసిన ప్రోమోల్లో అమితాబ్‌, జయా అనుబంధం చూపించారు. అయితే తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమోలో అమిత్‌పై జయా.. ఫిర్యాదు చేసింది. ‘ఫోన్‌ చేస్తే.. అస్సలు లిఫ్ట్ చేయరు’ అని కంప్లైంట్‌ చేశారు. ‘ఇంటర్‌నెట్‌ వస్తూపోతూ ఉంటే నేను ఏం చేయను?’ అంటూ అమితాబ్‌ ఫన్నీగా తనను తాను సమర్థించుకున్నారు.

స్వేతా బచ్చన్‌ జోక్యం చేసుకొని జయా పక్షాన మాట్లూడుతూ.. ‘సోషల్‌ మీడియాలో ఫోటోలు పంచుకోవడం, ట్వీట్లు పెట్టడం చేస్తారు’ అని గుర్తుచేస్తుంది. టాపిక్‌ మారుస్తూ.. అమితాబ్‌ ‘జయా నువ్వు చాలా అందంగా ఉన్నావు’ అని అంటారు. వెంటనే స్పందిన జయా.. ‘మీరు అబద్దాలు చెప్పేటప్పుడు బాగుండరు’ అని సరదగా బదులిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక 1000వ ఎపిసోడ్‌ డిసెంబర్‌ 3 రాత్రి 9 గంటలకు టీవీల్లో ప్రసారం కానుంది.

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

మరిన్ని వార్తలు