‘బంగార్రాజు’తో రీఎంట్రీ ఇవ్వబోతున్న ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌!

23 Jun, 2021 15:00 IST|Sakshi

‘కింగ్‌’ నాగార్జున అక్కినేని-రమ్యకృష్ణ జంటగా డైరెక్టర్‌ కల్యాణ్‌ కృష్ణ తెరకెక్కించిన హిట్‌ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయన’.  ఎలాంటి అంచనాలు లేకుండా 2016లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో డైరెక్టర్‌ కల్యాణ్‌ దీనికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే బంగార్రాజును సెట్స్‌పైకి తీసుకురానున్నట్లు డైరెక్టర్‌ ప్రకటించినప్పటి నుంచి దీనికి సంపాదించిన అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. అయితే ఇందులో అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్‌ నటిస్తుండగా చైకి జోడిగా సమంత నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ఆ తర్వాత సమంత కాదని తమిళ హీరోయిన్‌ ప్రియాంక అరుల్‌ మోహన్‌ను అనుకుంటున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా బంగార్రాజు నుంచి మరో అసక్తికిర అప్‌డేట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. తాజా సమచారం ప్రకారం ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ జయప్రదను చిత్రం బృందం సంప్రదించినట్లు సమాచారం. డైరెక్టర్‌ కల్యాణ్‌ ఆమెను కలిసి పాత్రను వివరించగా అది నచ్చడంతో జయప్రద గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ మూవీ కోసం డెట్స్‌ కూడా ఇచ్చినట్లు టాలీవుడ్‌లో టాక్‌. కాగా కొంతకాలంగా జయప్రద తెలుగు తెరపై కనిపించడం లేదు. చాలా గ్యాప్‌ తర్వాత ‘బంగార్రాజు’ మూవీతో టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇవ్వడం నిజంగా ఆమె అభిమానులకు పండగే. అలాగే దీనితో పాటు జయప్రద ఓ వెబ్‌ సిరీస్‌తో కూడా త్వరలో ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో కూడా నాగార్జునకు జోడిగా నటి రమ్యకృష్ణ నటించనుంది. 

చదవండి: 
నాగార్జున యాక్షన్‌ మూవీ: జూన్‌లో ప్రారంభం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు