జీవజ్యోతి గుర్తుందా..? తెరపైకి ఆమె బయోపిక్‌..

9 Jul, 2021 06:45 IST|Sakshi

Jeevajothi Santhakumar Biopic: జీవజ్యోతి బయోపిక్‌ సినిమాగా రూపొందనుంది. జీవజ్యోతి పేరు కొనేళ్ల క్రితం పత్రికల్లో మారుమోగింది. ప్రముఖ హోటల్‌ శరవణ భవన్‌ అధినేత రాజగోపాల్‌ తన హోటల్‌లో పని చేసే కార్మికురాలైన జీవజ్యోతిని వశపరచుకోవడానికి ఆమె భర్తను చంపించారు. రాజగోపాల్‌పై కార్మికురాలైన జీవజ్యోతి 18 ఏళ్లు పెద్ద పోరాటమే చేసి గెలుపు సాధించింది.

ఈ సంఘటనతో జీవజ్యోతి బయోపిక్‌ను జంగిల్‌ పిక్చర్స్‌ చిత్ర నిర్మాణ సంస్థ సినిమాగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో జీవజ్యోతి, రాజగోపాల్‌ పాత్రల్లో నటించే నటీనటులు, సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేస్తున్నారు. దీనిపై స్పందించిన జీవజ్యోతి అర్థబలం, అంగబలం కలిగిన ఒక హోటల్‌ అధినేతపై తన 18 ఏళ్ల పోరును జంగిల్‌ పిక్చర్స్‌ సంస్థ సినిమాగా రూపొందించడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. తన జీవిత గాథను తెరపై చూసిన తర్వాత పురుషాధిక్యం కారణంగా తాను అనుభవించిన బాధ అందరికీ తెలుస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు