‘మా’ అధ్యక్ష బరిలో జీవిత

22 Jun, 2021 22:57 IST|Sakshi

‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికలు ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి జరుగుతాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి జరగనున్న ‘మా’ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఇప్పటికే ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రేసులో జీవితా రాజశేఖర్‌ పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ‘మా’ కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు జీవిత.

అధ్యక్ష పదవిలో ఉంటే ఇంకా ఎక్కువగా సేవలు చేసే వీలుంటుందనే ఆలోచనతోనే ఆమె బరిలోకి దిగారని సమాచారం. ఇప్పటికే సీనియర్‌ నటుడు ప్రకాశ్‌రాజ్, యంగ్‌ హీరో విష్ణు పోటీలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జీవిత పేరు కూడా చేరడంతో ‘మా’ ఎన్నికల గురించి వాడి వేడి చర్చలు మొదలయ్యాయి. ప్రెసిడెంట్‌ పదవికి పోటీ పడాలనుకుంటున్న విషయాన్ని మరో రెండు రోజుల్లో జీవిత అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నారని తెలిసింది. 

మరిన్ని వార్తలు