Jeevitha Rajasekhar-Chiranjeevi: మనసున్న ప్రతి ఒక్కరికి 'శేఖర్‌' నచ్చుతాడు: జీవిత

15 May, 2022 19:41 IST|Sakshi

టాలీవుడ్‌లో​​​​​‍​ యాంగ్రీ ఎంగ్‌ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న హీరో రాజశేఖర్. ఆయన తాజాగా నటించిన చిత్రం 'శేఖర్'.​​ జీవితా రాజశేఖర్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో రాజశేఖర్‌ కుమార్తె  శివాని రాజశేఖర్‌ కూడా నటించింది. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ దేశవ్యాప్తంగా మే 20న విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో డైరెక్టర్‌ జీవిత రాజశేఖర్‌ ముచ్చటించారు. 

'కొన్ని పరిస్థితుల వల్ల దర్శకురాలిగా మారాను తప్ప నిజానికి నాకు డైరెక్షన్‌ చేయలానే ఆసక్తి ఎప్పుడూ లేదు. తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ట్రూ స్టోరీ శేషు మూవీని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా కథను మార్చకుండా తీయాలని అనుకున్నాం. అలా చేసేందుకు ఏ డైరెక్టర్‌ ముందుకు రాలేదు. దీంతో నేనే ఆ సినిమాకు దర్శకత్వం వహించాల్సి వచ్చింది. దర్శకురాలిగా అది నా మొదటి చిత్రం. మలయాళంలో హిట్‌ సాధించిన జోసెఫ్‌ సినిమాను శేఖర్‌ పేరుతో తెరకెక్కించాం. 'పలాస' డైరెక్టర్‌ కరుణ కుమార్‌, నీలకంఠను కలిశాం. వారు బిజీగా ఉండటంతో నేనే డైరెక్షన్‌ చేశాను. మనసున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో 'శేఖర్‌' ఉంటాడు అనేలా ఈ మూవీ కనెక్ట్‌ అవుతుంది. మాకు ఎవరితోనూ ఏ ఇష్యూ లేవు కానీ చిరంజీవి గారితో ఎప్పుడో జరిగిన విషయాన్ని రిపీట్ చేస్తూ.. యూట్యూబ్ వారే థంబ్‌నేయిల్స్‌ పెట్టి మా మధ్య ఇంకా దూరాన్ని పెంచుతున్నారు.' అని జీవితా రాజశేఖర్‌ తెలిపారు. 

ఇంకా ఆమె మాట్లాడుతూ 'వన్ వీక్‌లో షూట్  స్టార్ట్ అవుతుంది అనగా రాజశేఖర్ గారికి కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత చాలా సీరియస్ కావడంతో తను బతుకుతాడా.. లేదా అనే పరిస్థితి ఏర్పడింది. అందరి ఆశీర్వాదంతో తను రికవరీ అయి ఈ సినిమా చేశారు. ఇందులో డాటర్‌ స్క్రీన్‌ స్పేస్‌ చాలా తక్కువ. కాబట్టి కొత్త అమ్మాయిను తీసుకొచ్చి వారి మధ్య డాటర్, ఫాదర్ రిలేషన్ బిల్డప్ చేయడం కంటే శివానినే కూతురిగా చేయిస్తే బాగుంటుందని చేయించాం. అందరూ రాజశేఖర్ నెగెటివ్ రోల్స్ చేస్తారా.. అని అడుగుతున్నారు. మొదట్లో తన జర్నీ విలన్ గానే మొదలైంది. బారతి రాజా దర్శకత్వంలో విలన్‌గా నటించారు. తర్వాత హీరోగా చేయడంతో బిజీ అయ్యారు. అయితే రామ్ చరణ్ సినిమా "ధ్రువ" లోని అరవిందస్వామి లాంటి క్యారెక్టర్, పెదరాయుడులోని రజినీకాంత్ క్యారెక్టర్ వంటి అన్‌టచబుల్ క్యారెక్టర్ వస్తే కచ్చితంగా చేస్తారు. అలాగే చిరంజీవి గారు ఆఫర్ ఇచ్చినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నారు. అలాగే నన్ను కూడా సేమ్ క్వశ్చన్ వేస్తున్నారు. నాకు మంచి క్యారెక్టర్ ఏది వచ్చినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.' అని పేర్కొన్నారు. 


 

మరిన్ని వార్తలు