ఆ వీడియోలతో వేధిస్తున్నాడు!: బుల్లితెర నటి

25 Apr, 2021 05:12 IST|Sakshi

సాక్షి, చెన్నై: వీడియోలను తీసి వేధింపులకు గురిచేస్తున్నాడని టీవీ సీరియల్‌ సహాయ దర్శకుడిపై బుల్లితెర నటి జెన్నిఫర్‌(24) శుక్రవారం చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందులో ఆమె పేర్కొంటూ తాను మనాలి సమీపంలోని చిన్న సేక్కాడు ప్రాంతంలో కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నానన్నారు. ఐదేళ్లుగా టీవీ సీరియల్లో నటిస్తున్నట్లు చెప్పారు. స్థానిక ఎమ్జీఆర్‌ నగర్కు చెందిన శరవణన్‌ అనే వ్యక్తిని గత 2019 ఆగస్టు 25న పెళ్లి చేసుకున్నానన్నారు. అయితే తమ మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయాం అన్నారు. శరవణన్‌తో వివాహ రద్దు కేసు కోర్టులో ఉందన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో తను, టీవీ సీరియల్‌ సహాయ దర్శకుడు నవీన్‌కుమార్‌ సహజీవనం చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో నవీన్‌కుమార్‌కు పనిపోయిందన్నారు. దీంతో అతను ఖర్చుల కోసం డబ్బు ఇవ్వాలని తనను వేధిస్తూ ఉండేవాడన్నారు. తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో షూటింగ్‌ స్పాట్‌ నుంచి తనను తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి నగ్నంగా వీడియో తీశాడని చెప్పారు. ఈ విషయం గురించి అతని తల్లి దృష్టికి తీసుకెళ్లగా ఆమె తన కొడుకు చెప్పినట్లు నడుచుకోమని బెదిరించారన్నారు. దీంతో నవీన్‌ కుమార్‌పై మనాలి పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. నవీన్‌ కుమార్‌ తీసిన వీడియోను తనకు ఇప్పించాలని, తనపై దౌర్జన్యాలకు పాల్పడిన నవీన్‌కుమార్, అతని తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు పేర్కొన్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు