Jetty Movie: ఒక ఊరిలో జరిగిన కథ

19 May, 2021 10:32 IST|Sakshi

నందితా శ్వేత, కృష్ణ , కన్నడ కిషోర్, మైమ్‌ గోపి, ఎమ్‌యస్‌ చౌదరి, శివాజీరాజా, జీవా, సుమన్‌ శెట్టి నటించిన చిత్రం ‘జెట్టి’. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వంలో వేణుమాధవ్‌ నిర్మించిన ఈ చిత్రం టైటిల్‌ లోగోని లాంచ్‌ చేశారు.

సుబ్రహ్మణ్యం పిచ్చుక మాట్లాడుతూ –‘‘కొన్ని వందల గ్రామాల్లోని వేల మత్స్యకార కుటుంబాల తరాల పోరాటం ఒక గోడ.. ఆ గోడ పేరే జెట్టి. అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న మత్య్సకారులున్న ఒక ఊరిలో జరిగిన కథ ఇది. మత్స్యకారుల జీవన శైలి, వారి కట్టుబాట్లతో తెరకెక్కించాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాని విడుదల చేస్తాం. మా చిత్రంలో సిద్‌ శ్రీరాం పాడిన పాట హైలెట్‌గా ఉంటుంది.. త్వరలోనే ఆ పాటను రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తిక్‌ కొండకండ్ల.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు